అక్షరాస్యతతోనే అభివృద్ధి

Sat,September 7, 2019 10:34 PM

ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించడానికి వివిధ దేశాల విద్యాశాఖామాత్యులు మొదటిసారిగా 1965, నవంబర్ 17న ఇరాన్ రాజధాని టెహరాన్‌లో సమావేశమయ్యారు. పిద ప 1966 అక్టోబర్‌లో జరిగిన 14వ యునెస్కో సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్ష రా స్యతా దినోత్సవంగా ప్రకటించారు. 1967 సంవత్స రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్షరాస్యతా కార్య క్రమాల తీరుతెన్నులు, సాఫల్య, వైఫల్యాలను సమీక్షించు కొని, నిర్దిష్ట వ్యూహంతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో పునరంకితమ వడమే ఈ దినోత్సవ ప్రధానోద్దేశం. యునెస్కో వారు 2019లో జరిగే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవానికి అక్షరాస్యత-హుభాషితం అనే నినాదాన్ని ప్రక టించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వర్తమాన సమాజంలో అక్షరాస్యత పెంపుదలకు గాని తదనంతర విద్యా ప్రమాణాలను పెంచుకోవ డానికి గాని నైపుణ్యాలతో కూడిన అక్షరాస్యత ఒక ప్రధాన సాధనం. అయితే నేటికి నిరక్షరాస్యత అంతర్జాతీయ సమస్యగానే నిలిచింది. ప్రపం చంలో పదిహేనేండ్ల వయసుదాటిన నిరక్షరాస్యుల్లో మూడొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే. ప్రపంచంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలం టే ఆ దేశంలో ప్రజలంతా అభివృద్ధిలో సమానపాత్ర కలిగి ఉండాలి. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల్లో అక్షరాస్యత గణనీయస్థాయిలో లేదు. అలాగే స్త్రీ పురుషుల అక్షరాస్యతా శాతం మధ్య నెలకొన్న అగాథం శోచ నీయం. విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళలు పోషించే పాత్రపైనే దేశ భవిత ఆధారపడి ఉంటుందని నెహ్రూ నాడే అభిప్రాయపడినారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంకా 75 కోట్ల వయోజనులు నిరక్షరాస్యతలో మగ్గుతున్నారు. 264 మిలియన్ల మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు.

వయోజన విద్య, నిరంతర విద్య కార్యక్రమాల అమలు విషయంలో దేశ స్థాయిలో కొంత అనిశ్చితి, స్తబ్ధత నెలకొన్నది. అయినప్పటికీ తెలంగాణ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ మాత్రం సాక్షర తెలంగాణ సాధన కోసం సుస్థిర సం కల్పంతో సరికొత్త వ్యూహాలను, ప్రణాళికలను రచిస్తూనే ఉన్నది. రాష్ట్ర విద్యా శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వయోజన విద్యాశాఖ ఒక సరికొత్త సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమం అమలుకు తలపె ట్టడం ముదావహం.


ఇంకా అనేక అంతర్జాతీయ సర్వేల ప్రకారం అభి వృద్ధి చెందిన దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమించిన వయోజను లు, యువత కు వృత్తి నైపుణ్యాలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలు ఆశించిన స్థాయిలో లేవు. కాబట్టి ఈ తేడాలను సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ డిజిటల్ ప్రపంచంలో నైపుణ్యాలు, అవగాహనతో కూడిన సం పూర్ణ అక్షరా స్యత సాధన కోసం ప్రభుత్వం, ప్రైవేట్‌రంగం, ప్రజలు, పౌర సంస్థల మధ్య సహకారం, సమన్వయం ఎంతగానో అవసరం ఉన్నది. అంతర్జాతీయ అక్ష రాస్యతా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం యునెస్కో వారు ప్రత్యేకం గా నిర్దేశించిన అక్షరాస్యత-బహుభాషితం అనే ప్రత్యేక అంశాన్ని అనుసరిం చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగురీతిలో సత్వర ప్రణాళిక రచన, అమలు కోసం కృషిచేయాలి. వయోజన విద్య, నిరంతర విద్య కార్యక్రమాల అమలు విషయంలో దేశ స్థాయిలో కొంత అనిశ్చితి, స్తబ్ధత నెలకొన్నది. అయినప్పటికీ తెలంగాణ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ మాత్రం సాక్షర తెలంగాణ సాధన కోసం సుస్థిర సం కల్పంతో సరికొత్త వ్యూహాలను, ప్రణాళికలను రచిస్తూనే ఉన్నది. రాష్ట్ర విద్యా శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వయోజన విద్యాశాఖ ఒక సరికొత్త సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమం అమలుకు తలపె ట్టడం ముదావహం. తెలంగాణ రాష్ట్రంలో వయోజన విద్య నిరంతర విద్య అనే మాట ఎత్తుకో గానే అందరికీ వెనువెంటనే గుర్తుకొచ్చేది రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం గత 40 ఏండ్లుగా రాష్ట్ర వయో జన విద్యాశాఖకు వెన్నెముకగా నిలిచింది. సంపూర్ణ అక్షరాస్యతా సాధనలో మునిగితేలుతున్న ఈ విలక్షణ వయోజన విద్యా వనరు లు శిక్షణాసంస్థ తెలంగాణ ముంగిటిలో సాధి కారంగా నిలిచిన ఒక సాక్షరతా సమాహారం. కేంద్ర మానవ వన రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సాక్షరతా మిష న్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ స్వయం ప్రతిపత్తిగల విద్యా సంస్థ పాత్ర లేని వయోజన విద్యా కార్యక్రమాన్ని కానీ, అమలును, అభివృద్ధిని కానీ ఎవరూ ఊహించలే నిదన్నది నిర్వివాదాంశం. ఇంతగా అందరి మన్ననలు పొంది జాతీయస్థాయిలో ఐదు అవార్డులను కైవసం చేసుకున్నది.

రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం తన సేవలన్నింటి నీ తన ప్రధాన విభాగాలైన
1.మెటీరియల్ మీడియా,
2.పోస్ట్ లిటరసీ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్,
3.ట్రైనింగ్‌ల ద్వారా రాష్ట్ర వయోజన విద్యా శాఖకు అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లు, యాస, భాషలను ప్రతిబింబించేలా తెలంగాణ వాచకం పుస్తకాన్ని రూపొందించింది. ఉర్దూ మాతృభాషగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలకు ఉపయుక్తంగా ఉర్దూ వాచకాలు రూపొందించింది. గోండ్‌వానా వేడ్‌చి గోం డులకు, కోయత్తూర్ వెల్తూర్ కోయలకు, బంజారా సీక్వాడీ బంజారాలకు, చదువుకుందాం బ్రైలీ వాచకం అంధులకు ప్రత్యేక లిప్యంతరీకరణ వాచకాలు రూపొందించింది. నూతన అక్షరాస్యుల అభ్యసన సామర్థ్యం, స్థాయిలకు తగినట్లుగా, సుల భంగా అర్థమయ్యేలా చిన్నచిన్న పదాలతో వివిధ గ్రేడులలో, వివిధ అంశాల పై పుస్తకాలను తయారుచేయడం పోస్ట్ లిటరసీ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ విభాగం వారుచేసే మరోపని. ఇందులో భాగంగా ఇప్పటివరకు 708 పుస్త కాలు తయారుచేశారు. వివిధ రకాల నేరారోపణలకు గురైన వారిలో, నిరక్షరాస్యులు అధికంగా ఉండటం గమనించి తెలంగాణ ప్రిజన్స్ శాఖ వారు కారాగారాల్లో ప్రయో గా త్మకంగా అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అట్లా కారాగారాల్లో చదువుకున్న వాలంటరీ టీచర్లకు కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఎస్‌ఆర్‌సీకి లభించింది.
Dr-bandi-sainna
ఇన్నివర్గాల వారిని అక్షరాస్యతా కార్యక్రమాల్లో శిక్షణలకు ఆహ్వానించడమే కాదు, వారికి శిక్షణకు సంబంధించిన సాహిత్యం అంటే శిక్షణ కరదీపికలు, సమాచార పుస్తకాలు, బ్రోచర్లు, మొదలైనవి అందించడం పరిపాటి. అట్లా వందకు పైగా శిక్షణ సంబంధ పుస్తకాలు, బ్రోచర్లు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశాం. ఈ క్రమంలోనే అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా వ్యవ సాయం, నైపుణ్యాలు, వివిధ పథకాలు ఆయా సందర్భాలను గురించి తెలిపే కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశాం. 40 ఏండ్లుగా సాధించిన ప్రగతి, విజయాలు, పురస్కారాలు, అనుభ వం, పరిశోధనల నేపథ్యంలో సాక్షర తెలంగాణ సాధన కోసం రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం పునరంకితమవుతుందని ఈ అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం సందర్భంగా సభ్యసమాజానికి విన్నవించుకుంటున్నది. ఈ నేపథ్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ అక్షరాస్యత మాధ్యమంగా సుస్థి ర అభివృద్ధితో కూడిన సమసమాజాన్ని, విజ్ఞానం, నైపుణ్యాలు, డిజిటల్ సాం కేతిక పరిజ్ఞానాల మేలిమి కలయికతో కూడిన సమాజాన్ని సృష్టించే బృహత్తర కార్యక్రమంలో పాల్గొంటూ, తమవంతు పాత్ర పోషించాలి.

(వ్యాసకర్త: సంచాలకులు రాష్ట్ర వయోజన విద్యావనరుల కేంద్రం, హైదరాబాద్)
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles