గణేష్ మహరాజ్‌కీ జై!

Fri,September 6, 2019 12:57 AM

ganesh-maharaj
విఘ్న నాయక చరణం
శీఘ్ర శుభమే తరుణం
ఆనందతాండవ మేను
గణపతి మీకిదే శరణం!
ఏడాదిన మీ పండుగ
ఆడిపాడెదరు నిండుగ
యువతీయువకులందరు
నవనాట్యాలతో దుంకగ!
ఆదిదేవుడవు గణపయ్య
ఆదుకోగ ఇలరావయ్య
మోదకం తిని మోదంతో
వేదనలన్ని తీర్చయ్య!
సకల ప్రజకు కూర్చు హాయి
అకలంక దీవెనలియ్యి
విశ్వమంత శుభములతో
ఆశీర్వాదాలనే ఇయ్యి!

- డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి, 94901 45913

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles