సాహసోపేత నిర్ణయం


Fri,July 12, 2019 01:48 AM

తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ర్టాన్ని సామాజికార్థికాభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అవినీతి వృక్షాన్ని సమూలంగా పెకిలించి వేయాలని నిర్ణయించడం సాహసోపేతం. వాస్తవానికి ఇదొక సంచలన ప్రకటన. సాధారణంగా ఏ పాలకులైనా అవినీతి నిర్మూలన జోలికి పోరు. ఎన్ని విధానాలు రూపొందించినా అధికార గణాలకు ఆగ్రహం కలుగుతుందనే కారణంగా పరిపాలన సంస్కరణలకు జంకుతారు. ఒక్కోసారి మార్పులు చేపట్టినా, ఒత్తిడులకు లొంగిపోయి వదిలివేస్తారు. కానీ స్వభావరీత్యా కేసీఆర్ ఉద్యమకారుడు కావడం, సాధారణ రాజకీయ నాయకుడు కాకుండా పాలనాదక్షుడు కావడం వల్ల ఈ సాహసానికి దిగారనవచ్చు. మన దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి ఈ అంశాన్ని చేపట్టడానికి సాహసించలేదు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించిన ప్రకారం-2018 అవినీతి అభిప్రాయ సూచికలో మన దేశం 180 దేశాలలో 78వ స్థానంలో ఉన్నది. ఎంత అయిష్టంగా ఉన్నా, తప్పనిసరై అధికారుల చేతులు తడిపిన అనుభవం అనేకమంది ఉన్నత విద్యావంతులకు కూడా ఉన్నది. మన వంటి వర్ధమాన దేశంలో అధికార గణం ఇనుప సంకెల మాదిరిగా మార్పునకు అంగీకరించకుండా ప్రజలపై పెత్తనం చేస్తుందనేది తెలిసిందే. ఇది ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగినో, అధికారినో తప్పుపట్టడం కాదు. స్థూలంగా వ్యవస్థ స్వభావం అటువంటిది. అయినప్పటికీ సాంకేతికరంగం తెచ్చిపెట్టిన సౌలభ్యం, చట్టాలలో మార్పులు, పారదర్శకత, పాలనా సంస్కరణలు, సమర్థపాలన ఆధారంగా అవినీతి రక్కసిని మట్టుపెట్టాలనే దృఢ నిశ్చయం కేసీఆర్‌లో కనిపిస్తున్నది.


తెలంగాణ రాష్ర్టాన్ని సాధించే పంథాపై కేసీఆర్‌కు ఎంత స్పష్టత ఉన్నదో, రాష్ట్ర సాధన తర్వాత సత్పరిపాలన, సత్వరాభివృద్ధిపై కూడా అంతే స్పష్టత ఉన్నది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన నిర్దిష్టమైన వ్యూహం, కార్యాచరణతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాను ఎంచుకున్న కార్యక్రమం ఒక్కో అడుగు వేస్తూ తెలంగాణలో పరివర్తన తీసుకొస్తున్నారు. గత పాలకులు అరువై ఏండ్లలో సాధించలేనిది ఒక ముఖ్యమంత్రి అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఐదేండ్ల పాలనలో చేసి చూపడం అపూర్వం.


కేసీఆర్ ఉన్నతస్థాయి విధాన నిర్ణయాలలో అవినీతికి తావులేకుండా చేశారనేది తెలిసిందే. కానీ మొత్తం పరిపాలనా వ్యవస్థను అవినీతి రహితం చేయడానికి ఎంతో కృషి అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడు తూ అవినీతి నిర్మూలనకు, సత్పరిపాలనకు మూడు విధానాలను ప్రకటించారు. ఇందులో ఒకటి గ్రామీణ విధానం. గ్రామీణ ప్రాంత ప్రజలను వేధిస్తున్న సమస్యలను విముక్తి కలిగించడమే ఈ విధాన లక్ష్యం. మరొకటి రెవెన్యూ విధా నం. అవినీతి లేని పరిపాలనను అందించడం దీని ఉద్దేశం. మూడవది నగర విధానం. ఇదికూ డా నగర ప్రాంతాలలో పటిష్టమైన పాలన అం దించడంతో పాటు అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా గలది. ఈ మూడు విధానాల ద్వారా గుణాత్మక పరిపాలనను నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. చట్టాలు పటిష్టం గా రూపొందించి, అధికారులకు, ప్రజలకు అవగాహన కలిగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామీణ పాలనపై విధి విధానాలపై కేసీఆర్ చెబుతున్నందువల్ల ఇప్పటికే స్థానిక రాజకీయ వర్గాలలో స్పష్టత ఏర్పడ్డది. ప్రజలు కూడా స్థానిక పాలనకు అనుగుణంగా మానసికంగా సిద్ధపడి ఉన్నారు. మూడునెలల కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మక పరివర్తన వస్తుందని కేసీఆర్ చెప్పడం గమనార్హం. గ్రామస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొన్నప్పుడు పథకాల అమలు పకడ్బందీగా సాగుతుంది. సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. గ్రామస్థాయిలో తర్ఫీదైన నాయకులు ఒక దశాబ్దం గడిచేనాటికి మరింత ఎదిగి రాజకీయరంగాన్ని మరింత సారవంతం చేస్తారు. ఇందులో మహిళలతో పాటు భిన్నవర్గాలకు చెందినవారు ఎదిగి సామాజిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తారు.

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించే పంథాపై కేసీఆర్‌కు ఎంత స్పష్టత ఉన్నదో, రాష్ట్ర సాధన తర్వాత సత్పరిపాలన, సత్వరాభివృద్ధిపై కూడా అంతే స్పష్టత ఉన్నది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి న నిర్దిష్టమైన వ్యూహం, కార్యాచరణతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాను ఎంచుకున్న కార్యక్రమం ఒక్కో అడుగు వేస్తూ తెలంగాణలో పరివర్తన తీసుకొస్తున్నారు. గత పాలకులు అరువై ఏండ్లలో సాధించలేనిది ఒక ముఖ్యమంత్రి అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఐదేండ్ల పాలనలో చేసి చూప డం అపూర్వం. సులభతర వ్యాపార విధానం ఎంత విజయవంతంగా సాగుతున్నదో మిషన్‌భగీర థ, ఉచిత కరెంటు, గ్రామీణ రహదారుల నిర్మాణం కూడా అంతే ప్రాధాన్యం పొంది అమలుకు నోచుకున్నాయి. కాళేశ్వరం తదితర నీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ విధంగా అన్నిరంగాలను గాడిలో పెట్టిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ తదుపరి కార్యాచరణగా అవినీతి నిర్మూలనపై దృష్టిపెట్టారు. అయితే అవినీతి పరిపాలనా సంబంధమైనదే కాదు, సామాజిక సంస్కృతికి సంబంధించినది కూడా. బుద్ధుడి వంటి అనేకమంది ప్రవక్తలు, సం స్కర్తలు బోధించినా సమాజంలో విలువలు పూర్తిగా పాదుకోలేదు. వారి బోధనల వల్లనే సమాజం ఈ మాత్రం ధర్మబద్ధంగా ఉందనేది అంగీకరించలసిందే. కానీ సమాజంలో నిరంతర సంస్కరణ లు అవసరం. మానవులలో ధర్మబద్ధత అంతరంగం నుంచి కూడా రావాలె. కేసీఆర్ అవినీతి రహి త పాలనకు అవసరమైన ప్రాతిపదికను నెలకొల్పుతారు. ప్రజలు ప్రత్యేకించి విద్యావంతులు చైతన్యవంతులై కేసీఆర్ పిలుపును స్వీకరించాలె. అవినీతి నిర్మూలన కోసం తమవంతు కృషి చేయాలె.

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles