మహిళల హక్కులు మరిచారు

Thu,July 11, 2019 11:51 PM

గ్రామీణ భారతంలో ఆదాయ సముపార్జనకు భూమి, చేయటానికి పని ఉండటమనేది ప్రధానం. ఈ విషయంలో మన పాలక ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకొని ఆలోచించిన దాఖలాలు కనిపించటం లేదు. కానీ వ్యవసాయోత్పత్తుల్లో మహిళలదే కీలక పాత్ర ఉంటున్నది. ఎందుకంటే గత రెండు దశాబ్దాల కాలంగా వ్యవసాయరంగంలో కరవు పరిస్థితుల కారణంగా నెలకొన్న సంక్షోభంతో పురుషులు వ్యవసాయేతర పనులకు మారిపోవటం కారణంగా వ్యవసాయమంతా మహిళలపైనే ఆధారపడి ఉంటున్నది. ఈ పరిస్థితులన్నీ వ్యవసాయరంగా న్ని మరింత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టివేసింది. ఇంకోవైపు వ్యవసాయంలో చేపడుతున్న యాంత్రీకరణ కారణంగా నానాటికీ మహిళలకు గ్రామాల్లో పని దొరుకని స్థితి ఏర్పడుతున్నది. వ్యవసాయం నుంచి దూరమైన మహిళకు మరో పని ఎంచుకునే స్థితి గ్రామాల్లో ఉండదు. పట్టణాల్లో కూడా అన్నిరంగాల్లో పురుషులకే పెద్దపీట ఉంటున్నది. దీం తో గ్రామీణ భారతంలో రోజురోజుకూ మహిళకు పనిదొరుకని పరిస్థితి ఏర్పడటం మరో సంక్షోభానికి దారితీస్తున్నది. పితృస్వామ్య సామాజిక విలువల కారణంగా భూమిపై యాజమాన్య హక్కులన్నీ పురుషుల చేతుల్లోనే ఉన్నవి. బీనా అగర్వాల్ చేసిన అధ్యయనం ప్రకారం.. దేశంలో 2-5 శాతం వ్యవసాయ యోగ్య భూమి మాత్రమే మహిళల చేతుల్లో ఉన్నది. అంటే ఆ భూమిపై మహిళలు హక్కు కలిగి ఉన్నారు. ఈ విధమైన సామాజిక పరిస్థితుల మూలంగా భూమి మాత్రమే కాదు, కుటుంబాలు కలిగి ఉండే ఇల్లు, ఇతర ఆదాయ వనరులపై ఎలాంటి హక్కు మహిళలకు లేదు. దీంతో ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో గుణాత్మక మార్పు ఉండటం లేదు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల సాధికారత కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. భూ రికార్డుల్లో మహిల పేరును నమోదు చేసేవిధంగా ప్రత్యేక చట్టం ద్వారా సరిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక కృషి జరుగాల్సి ఉన్నది. గ్రామం, తహసీల్ స్థాయిలో మహిళలకు ప్రాధాన్యం గురించి చైతన్యపరుచాలి.


వ్యవసాయ సంబంధమైన భూమితో పాటు, ఇతర వ్యవసాయ వినియోగ పరికరా లు, ట్రాక్టర్లు, యంత్రాలన్నింటిపై మహిళలకు ఏ విధమైన యాజమాన్య హక్కు ఉండటం లేదు. ఫలితంగా వ్యవసాయరంగంలో వస్తున్న అభివృద్ధి, సాంకేతికరంగాల్లో మహిళలకు స్థానం, పాత్ర ఉండటం లేదు. మరోవైపు పెరుగుతున్న వ్యవసాయోత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం ఉండటం లేదు. దీంతో మహిళల సాధికారత అటుంచి అనేక విధాలుగా మహిళ పరాధీనురాలిగానే ఉంటున్నది. మహిళలపై గృహహింస, అణిచివేతలు సాధారణమైపోయాయి. ఈ క్రమంలోంచే వ్యవసాయరంగంలో మహిళల నిర్ణయాత్మక పాత్రకు గుర్తింపు లేకపోవటమే కాదు, వివక్షకు గురవుతున్నది. వ్యవసాయరంగంలో మహిళలదే అగ్రస్థానమైనా మహిళల శ్రమకు విలువ ఉండటం లేదు. కాలానుగుణంగా దినకూలీ వేతనా లు ఉండటం లేదు. ఈ విధమైన సామాజిక దోపిడీ, అణిచివేత, వివక్షల కారణంగా భ్రూణహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఏదేమైనా.. భూమిపై యాజమాన్య హక్కులు కల్పించకుండా మహిళలకు గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. ఈ మూలాల్లోంచే వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీలు, ఇతర వ్యవసాయ సంబంధ సంఘాల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కటం లేదు. 1956కు మందు భూమి, ఇతరాలపై ఆ సమాజంలో పరంపరాగతంగా వస్తున్న వంశపారంపర్య హక్కులే ఆ కుటుంబ వ్యక్తులకు సంక్రమించేవి. అలాగే మహిళలకు సమాన హక్కులని చెప్పబడుతుండేవి. హిందూ వారసత్వ హక్కు చట్టం కూడా ఇదే చెప్పింది. ఈ మూలాల్లోంచే హిందూవారసత్వ హక్కు చట్టం 1956 వచ్చింది. ఇందులో వారసత్వ హక్కు అని చెప్పారు కానీ స్పష్టత లేదు.

మహిళలు పనిచేస్తున్నచోట మహిళలకు అనుకూలంగా ప్రత్యేక వసతులుండటం లేదు. దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనం ప్రకారం 5 వేల మార్కెట్లలో మహిళలకు కనీస వసతులు లేవు. ఈ స్థితిలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రత్యేక చొరవతో 2024 నాటికి కనీసం 30 శాతం భూ రికార్డులు మహిళల పేరుతో ఉండేట్లు చర్యలు తీసుకోవాలి.


1950 తర్వాత భారత దేశంలో చోటుచేసుకున్న భూ వారసత్వ హక్కులో స్త్రీ, పురుషులకు సమాన హక్కు అని పేర్కొనకపోవటం వల్ల సమానత్వం నామ మాత్రం అయిపోయింది. ఈ విషయాన్ని నాటి మహిళా హక్కుల సంఘాలు కూడా గుర్తించి ప్రశ్నించిన పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వ విధానాలు, చేపట్టిన సంస్కరణల్లో మహిళలకు స్థానం కనిష్టంగా మారిపోయింది. అలాగే భూ హక్కులనేవి ప్రధాన సమస్య కాకుండా పోయింది. ఈ నేపథ్యంలో జాతీయ సలహా మండలి సభ్యునిగా నేను సోనియాగాం ధీకి మహిళలకు భూమిపై హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని గురించి వివరించాను. నేను చెప్పిన విషయంతో నోట్‌ను తయారుచేసి కేంద్ర లా మినిస్ట్రీకి పంపించారు. తత్ఫలితంగానే హిందూ వారసత్వ హక్కు చట్టం 2005లో మార్పులు చోటుచేసుకున్నాయి. వివక్షకు పునాదిగా ఉన్న వాటిని ఆ చట్టం నుంచి తొలిగించారు. ఇది హిందువులతో పాటు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు కూడా వర్తిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులు భూమిపై సంక్రమించాయి. ఈ చట్టంతో దేశవ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాదిమంది మహిళలు ప్రయోజనం పొందగలుగుతారు. కానీ ఆ చట్టం అమలుచేయటం గురించి కేంద్ర భూ వనరుల శాఖ కానీ, కేంద్ర శిశుసంక్షేమ శాఖ కానీ రాష్ర్టాలకు ఎలాంటి లేఖ రాయలేదు. దీనికి తోడు రాష్ర్టాలు కూడా ఈ చట్టం అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపా యి. ఇదిలా ఉండగానే యూపీలో కుటుంబంలోని అవివాహిత మహిళలు, బిడ్డలకు మాత్రమే భూమిపై వారసత్వ హక్కు ఉంటుందనీ, వివాహితులైతే ఆ హక్కు వర్తించదని మరో చట్టం చేసింది. నిజానికి కేంద్రం చేసిన చట్ట స్ఫూర్తికి ఇది విరుద్ధమైనది.

ఎవరో ఒకరు కోర్టుకు పోయి ఈ చట్టవిరుద్ధమైన దాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేస్తారని ఆశిద్దాం. ఇక రాజసాన్‌లో చేసిన చట్టంలో సెక్షన్ 46(1) అనేది మహిళలను కనీసం మనుషులుగా, వ్యక్తిత్వం కలవారిగా గుర్తించ నిరాకరించిన విధంగా వ్యక్తపరిచింది. అయినా స్థూలంగా, చట్టపరంగా మహిళలకు అనుకూలంగా చట్టపరమైన హక్కులకు సమర్థన వచ్చింది. కానీ చాలా సందర్భాల్లో మహిళలకు వివాహ సంబంధమైన సమస్యలు తలెత్తినప్పుడు, లేదా విడిపోయినప్పుడు తల్లిగారి ఇంటివైపు నుంచి సమర్థన, సహాయం కూడా అందటం లేదు. చాలా సందర్భాల్లో ఇరువైపుల నుంచీ మద్దతు లభించని స్థితి ఉంటున్నది. ఇదిలా ఉంటే న్యాయసమ్మతంగా హక్కుదారులుగా భూ రికార్డుల్లో పేర్లు నమోదు చేయటంలో కూడా అనేక విధాలుగా అవరోధాలు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో హక్కుదారుగా పేరున్నా వాస్తవ రూపంలో వారికి దానిపై మహిళలకు యాజమాన్య హక్కును చెలాయించలేని స్థితి ఉంటున్నది. ఇంకా పితృస్వామిక సమాజంలోనైతే ఈ విధమైన హక్కులు మృగ్యం. మాతృస్వామ్య సామాజిక విలువలున్న మేఘాలయలోనూ స్త్రీలకు ఏ విధమైన హక్కులుండటం లేదు. ఇక ఆధునిక కార్పొరేట్ సంస్కృతి, మార్కెట్ వ్యవస్థల్లోనూ సర్వత్రా పురుషులదే ఆధిపత్యం, పెత్తనం. అమ్మకాలు, కొనుగోళ్లు, అప్పులు తీసుకోవటంలోనూ మహిళల పాత్ర నామమాత్రం. సర్వత్రా పరాధీనతలో పనిచేయాల్సిన దుస్థితి ఉంటున్నది. వివక్ష, అణిచివేతల్లో రూపం వేరైనా మహిళల స్థానం మాత్రం కడగొట్టుదిగానే ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల సాధికారత కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
nareshchandra
భూ రికార్డుల్లో మహిల పేరును నమోదు చేసేవిధంగా ప్రత్యేక చట్టం ద్వారా సరిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక కృషి జరుగాల్సి ఉన్నది. గ్రామం, తహసీల్ స్థాయి లో మహిళలకు ప్రాధాన్యం గురించి చైతన్యపరుచాలి. తద్వారా అన్ని రంగాల్లో పితృస్వామిక భావజాలంతో నిండి ఉన్న స్థితిని మహిళలకు సానుకూలంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరోవైపు మహిళలు పనిచేస్తున్నచోట మహిళలకు అనుకూలంగా ప్రత్యేక వసతులుండటం లేదు. దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనం ప్రకా రం 5 వేల మార్కెట్లలో మహిళలకు కనీస వసతులు లేవు. ఈ స్థితిలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రత్యేక చొరవతో 2024 నాటికి కనీసం 30 శాతం భూ రికార్డులు మహిళల పేరుతో ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. మహిళలకు భూమిపై హక్కులు కల్పించేవిధంగా సమాజంలో చైతన్యం తేవటానికి కరపత్రాలు, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఇప్పుడు అధికారం, ఆధిపత్యం పంపకం జరుగటంతో పాటు ఆదా య పంపకం కూడా జరుగాలి. ఇలా జరిగినప్పుడే సామాజిక అంతరా లు, వివక్షలు రూపుమాసిపోతాయి. భూమి మొదలు సమస్థ స్థిర, చర ఆస్తులపై మహిళలకు కూడా హక్కు, యాజమాన్యం లభించినప్పుడే మహళాసాధికారత సాధ్యమవుతుంది. ఈ విధమైన సంస్కరణలకు అం కురార్పణ జరిగినప్పుడే మహిళా సంక్షేమం, అభ్యున్నతికి ఆవకాశం ఉం టుంది. ఇలాంటి మౌలిక విషయాలు, సమస్యల పట్ల ఆర్థిక మంత్రి దృష్టి సారించినప్పుడే మహిళల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
(వ్యాసకర్త: ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు) ది వైర్ సౌజన్యంతో...

212
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles