రైతుబంధు: చర్చకు రాని కోణం


Thu,July 11, 2019 12:14 AM

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు స్వప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తుండగా, కొం దరు వాస్తవాలు తెలియక అవే అపోహలకు గురవుతున్నారు. అందువ ల్ల దీనిపై కొంత వివరణ అవసరమవుతున్నది. రైతుబంధు పథకాన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మొదటిది నిధుల పంపిణీ విషయం. రెండవది చిన్న రైతులు, మధ్య రైతులు, పెద్ద రైతుల మాట. మూడవది, పైన చెప్పుకున్నట్లు, వ్యవసాయంలో మిగులు సంపదలు ఏర్పడి అవి పెట్టుబడులుగా మారటం. విషయాన్ని చూడవలసిన పద్ధతి ఇది కాగా విమర్శకులు తమ విమర్శకు ఉపయోగపడే కొన్ని సం ఖ్యలను మాత్రం తీసుకొని ఆ పని చేస్తున్నారు. వాస్తవాలను గమనించి సమగ్ర దృష్టిని తీసుకోవలసిన ఆర్థికవేత్తలు, పరిశోధకులు ఎందుకైతేనే మీ మౌనంగా ఉన్నారు. వారి మౌనం వల్లనే సాధారణ ప్రజలకు సరైన అవగాహన కలుగడం లేదు. దీర్ఘకాలిక దృష్టి ఏర్పడటం లేదు. దానితో ఒకమేరకు విమర్శకుల ప్రభావానికి లోనవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అస్పష్టతలను పోగొట్టేందుకు, సరైన అవగాహన కలిగేందుకు వీలైనంత ప్రయత్నిద్దాము. ముందుగా అంకెల సంగ తి చూద్దాము. తెలంగాణలో మొత్తం భూమి ఒక కోటి 40 లక్షల 47 వేల ఎకరాలు. మొత్తం రైతులు 57 లక్షల 24 వేల చిల్లర. వీరందరికి కలిపి రైతుబంధు పథకం కింద 5 వేల 618 కోట్ల చిల్లర పంపిణీ చేశారు. సహాయం పొందుతున్న రైతుల్లో అయిదు విధాలైన వారున్నారు. 1. రెం డున్నర ఎకరాల లోపు చిన్నకారు రైతులు, 2. రెండున్నర నుంచి ఐదెకరాల సన్నకారు రైతులు. 3.5 నుంచి 10 ఎకరాల దిగువ మధ్య తరగతి రైతులు. 4.10 నుంచి 25 ఎకరాల ఎగువ మధ్య తరగతి రైతులు. 5.25 ఎకరాలకు మించిన పెద్ద రైతులు. వీరందరికి ఎకరానికి నాలుగు వేల రూపాయాలతో ఆరంభించి, ఇప్పుడు అయిదు వేలకు పెంచారు.


తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతుబంధు పథకాన్ని అత్యధికులు ప్రశంసిస్తుండగా కొందరుమాత్రం అపోహలు సృష్టిస్తుండటం తెలిసిన విషయమే. ఆ మాట అట్లుంచి అసలు దీనంతటిలో చర్చకు రాని విషయం ఒకటున్నది. అది, ఇటువంటి చర్యల వల్ల తెలంగాణ వ్యవసాయం బాగుపడటం సరేసరి కాగా,ఈ రంగంలో క్రమంగా మిగులు సంపదల సృష్టి జరిగి, రైతాంగం నుంచి కూడా పెట్టుబడిదారులు, వ్యాపారులు, పారిశ్రామికులు ఆవిర్భవించటం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం. అది రాష్ట్ర రైతు చరిత్రను కొత్త మలుపు తిప్పుతుంది.


ఇందులో అపోహల సృష్టి జరుగుతున్నది ఎక్కడ? పైన పేర్కొన్న అయిదు తరగతుల రైతుల్లో కొందరు చివరి మూడింటిని, కొందరు చివ రి రెండింటిని కలిపివేసి, ఈ పథకం మొత్తంగానే పెద్ద రైతులకు ఉపయోగపడతున్నదనే విమర్శ చేస్తున్నారు. కానీ ఇటువంటి విమర్శకులకు కేవ లం అంకెలు ఆధారం కాకూడడదు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా యనే దానితో పాటు తనకు గల నీటి సదుపాయం, ఇతర వనరులను సమకూర్చుకునే శక్తి, పంట దిగుబడి తీరు, మార్కెటు పరిస్థితి, అప్పుల భారం వంటి కీలకమైన ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కనీస జ్ఞానానికి సంబంధించిన విషయం. ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా గల ప్రాంతంలోని ఒక ఎకరానికి తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఐదెకరాలు, ఒక్కోసారి అంతకుమించి కూడా సమానం కాలేవు. పై తరహా వనరులు , ఇతర పరిస్థితులు తెలంగాణలో ఏ విధంగా ఉన్నయో కొత్తగా చెప్పనక్కరలేదు. అక్కడ 15-20 ఎకరాల రైతు తప్ప రెండు పూటలా భరోసాగా తిని, కనీస కుటుంబ అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేదు. వారిలోనూ పలువురు అప్పులు చేస్తున్నారు. వారి 15-20 ఎకరాలు కూడా పై తరహా వనరులున్న ప్రాంతంలోని 3-4 ఎకరాలకు సమానమంటే అతిశయోక్తి కాదు దీనిపై అనేక అధ్యయనాలు ఉన్నాయి. అటువంటప్పుడు తెలంగాణ రైతు గురించిన అంచనాలకు తెలంగాణ పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకోవాలి తప్ప, కేవ లం ఎకరం లెక్కల ఛార్టర్డ్ అకౌంటెన్సీలు అవాస్తవిక దృష్టి అవుతాయి. ఇందులో పైన పేర్కొన్న 5వ తరగతి రైతుల మినహాయింపును డిమాండ్ చేయటం కొంత సహేతుకంగా తోచవచ్చు. కానీ, కనీసం తగినంత కాలం పాటు, అది కూడా సరికాకపోవచ్చు. సహాయం కొనసాగింపే ప్రస్తుతానికి సరైనది కావచ్చు. ఏవిధంగానో మొదటనే కొంత చెప్పుకున్నాము. తర్వాత మరికొంత చూద్దాము. ఈ పరిస్థితుల్లో అంకెలను మరింత విశ్లేషించుకోవటం అవసరం.

తెలంగాణ వంటి ప్రాంతంలో రైతాంగం తమ నిత్యజీవిత సమస్యలను తీర్చుకోవటంతో ఆగిపోకూడదు. ఆ తర్వాతి దశలలోకి ప్రవేశించాలి. చిన్నకారు, సన్నకారు, దిగువ, మధ్యశ్రేణి రైతులు పేదరికం, ఆకలి నుంచి బయటపడటమే గాక, ఎంతోకొంత మిగులును సాధించగలగాలి. అం దుకు తగిన చర్యలు, వ్యూహాలు ఉండాలి. తెలంగాణ వంటి ప్రాంతం వ్యవసాయికంగా, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలంటే ఈ దశలో చిన్న-మధ్య-పెద్ద అనే తారతమ్యం లేకుండా యావత్ రైతాంగం ప్రస్తుత స్థాయి నుంచి అనేక రెట్లు పైకి ఎదుగాలి. అది జరిగినప్పుడు రైతు జీవితానికి భరోసా ఏర్పడటం తొలిదశ కాగా, వ్యవసాయంలో మిగుల సంపదల సృష్టి, అవి పెట్టుబడులుగా మారటం మలి అవుతుంది.


ఇక్కడ మొత్తం 57 లక్షల 40 వేల మంది రైతులలో 10-25 ఎకరాల వారు కేవలం 94 వేలు కాగా, 25 ఎకరాలకు మించినవారు 6 వేల చిల్ల ర మాత్రమే. ఉభయులు కలిపి సుమారు లక్షమంది. రైతుబంధు నిధు లు 5 వేల 618 కోట్లలో 10 ఎకరాలు అంతకుమించి ఉన్నవారికి లభించింది సుమారు 609 కోట్లు. అది సుమారు 10.85 శాతం. మరొక విధంగా చెప్పాలంటే, 89.15 శాతం నిధులు 10 ఎకరాలకు లోపు వారికి అందుతున్నాయి. పాతిక ఎకరాలు దాటినవారు 6,448 మంది. మొత్తం రైతుల సంఖ్యలో వీరు 0.11 శాతం. వాస్తవాలు ఇవి కాగా, కొందరు విమర్శకులు ఈ పథకం యావత్తును ప్రభుత్వం పెద్ద రైతుల కోసం అమలు పరుస్తున్నది అన్నట్లుగా మాట్లాడటం ఒక వింత. 15-20-25 ఎకరాలు దాటినవారికి ఈ పథకం ఎం దుకని 2-4-5 ఎకరాల రైతులకు అనిపించటం సహజం. అదే సమయంలో ఈ భావన నీటి సదుపాయం వంటి వనరులు గల గ్రామాలలో తప్ప ఇతరత్రా లేదు. నీరు, వనరులు లేనందున 10-15 ఎకరాల రైతు వ్యవసాయం కూడా సరిగా సాగకపోవటం, తనూ అప్పుల పాలు కావ టం, వేరే పనులు చేసుకోవటం వంటి విషయాలు 2-4-5 ఎకరాల రైతుకు తెలుసు. అందువల్ల, ప్రాజెక్టులు ఎట్లానూ లేకపోగా వర్షాలూ సరిగా ఉండని తెలంగాణలో, ఈ తేడాలన్నవి అత్యధిక ప్రాంతాలలో మిథ్య మాత్రమే. కనుక, తెలంగాణ రైతు బాగును, వ్యవసాయం బాగు ను నిజంగా కోరుకునే వారు చేయవలసింది సమగ్రమైన, వాస్తవికమైన దృష్టిని తీసుకోవటం. తగు అవగాహన లేనివారికి దానిని కల్పించటం. ఇప్పుడు చివరి విషయానికి వద్దాము. ఇది క్లుప్తంగా మొదట ప్రస్తావించుకున్నదే. పైన అనుకున్నట్లు, తెలంగాణ వ్యవసాయాన్ని దీర్ఘకాలిక దృష్టితో, సమగ్ర దృష్టితో చూడవలసిన విషయం ఇది. ఆ పనిచేసినప్పుడు పైన పేర్కొన్న అంకెలు, తేడాలు ప్రధానమైనవిగా తోచవు కూడా.
Ashok
మనం తెలంగాణ వ్యవసాయంతో ముడిపెట్టి ఈ రాష్ట్ర దీర్ఘకాలిక భవితవ్యం గురించి ఊహించటం, అంచనాలు వేయటం చేయాలి. అటువం టి దార్శనికత అవసరం. కేసీఆర్ ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతుబం ధు పథకాన్ని ఆయన వ్యవసాయ-గ్రామీణ రంగాల కోసం తెచ్చిన ఇతర కార్యక్రమాలతో కలిపి చూడాలి. ఇవి అన్నీ కలిపి ఉమ్మడిగా ప్రభావాన్ని చూపుతాయి గనుక. అటువంటి ఉమ్మడి ప్రభావంతోనే మార్పు వస్తుంది గనుక. తెలంగాణ వంటి ప్రాంతంలో రైతాంగం తమ నిత్యజీవిత సమస్యల ను తీర్చుకోవటంతో ఆగిపోకూడదు. ఆ తర్వాతి దశలలోకి ప్రవేశించాలి. చిన్నకారు, సన్నకారు, దిగువ, మధ్య శ్రేణి రైతులు పేదరికం, ఆకలి నుం చి బయటపడటమే గాక, ఎంతోకొంత మిగులును సాధించగలగాలి. అం దుకు తగిన చర్యలు, వ్యూహాలు ఉండాలి. తెలంగాణ వంటి ప్రాంతం వ్యవసాయికంగా, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలంటే ఈ దశలో చిన్న-మధ్య-పెద్ద అనే తారతమ్యం లేకుండా యావత్ రైతాంగం ప్రస్తుత స్థాయి నుంచి అనేక రెట్లు పైకి ఎదుగాలి. అది జరిగినప్పుడు రైతు జీవితానికి భరోసా ఏర్పడటం తొలిదశ కాగా, వ్యవసాయంలో మిగుల సంపదల సృష్టి, అవి పెట్టుబడులుగా మారటం మలి అవుతుంది. రైతుబంధు పథకం ఇతర పథకాలతో కలిసి ఫలితాలను ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది. నీరు, ఇతర వనరులు, మార్కెట్లు సవ్యంగా అందుబాటులో గల ప్రాంతాలు అన్నింటా ఇదే జరిగింది. సంప్రదాయిక వ్యవసాయ సమాజాలు, ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థలు ఆధునిక దశలోకి అడుగుపెట్టాయి. వేర్వే రు వర్గాల మధ్య వ్యత్యాసాలు కొనసాగినా వెనుకటి పేదరికాలు పోయా యి. సంపదల సృష్టికి, ఆధునికతకు పునాదులు పడ్డాయి. చరిత్ర రుజు వు చేసిన ఇటువంటి మార్గంలో ప్రయాణించటం ఒక్కటే తెలంగాణకు అనుసరణీయం. అందువల్ల, రాష్ట్రం మేలును, భవిష్యత్తును కోరుకునేవారు సంకుచిత దృష్టిని వదిలి ఇటువంటి కోణాలను స్వీకరించాలి.

556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles