హైదరాబాద్ కోహినూర్ వజ్రం


Thu,July 11, 2019 12:11 AM

ali-nawaz-jung-bahadur
సీమాంధ్ర వలస పాలనలో మన చరిత్ర మనకు కాకుండా పోయింది. మనవాళ్లు ఎవరో, మన జాతి నిర్మాతలు, మన వైతాళికులు ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. మన చరి త్ర మనకు అందకుండాపోయింది. అందుకే తెలంగాణ కావాలని చెబుతూ సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయా న్ని, ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్షను, స్వాతంత్య్రానికి పూర్వం హైదరా బాద్ రాజ్యంలో అలీ నవాజ్ జంగ్ కృషిని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ఓ కాలేజీకి వక్తగా వెళ్లిన సంద ర్భంగా వివరించారు. ఇక్కడ అది ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే.. నాడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ గురించి ఎవరికీ తెలియకపోయినా ఇప్పుడు బాగా తెలు సు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అధికారికం గా అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్ జయంతి జూలై 11ను తెలంగాణ ఇంజి నీర్స్ డేగా ప్రకటించింది. నాలుగేండ్లుగా జూలై 11న అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇంజినీర్స్ డే జరుపుకుంటున్నారు. సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించు కున్నాం. ఆయన పేరుమీద వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వెట రన్ ఇంజినీర్లకు నవాజ్ జంగ్ బహద్దూ ర్ మెమోరియల్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు 2015 సంవత్సరం నుంచి ప్రదానం చేస్తున్నారు. మూడేండ్లుగా పత్రికల్లో, టీవీల్లో ఆయనపై అనేక ప్రత్యేక కథనాలు ప్రచు రించి, ప్రసారం చేసి అలీ నవాజ్‌జంగ్ కృషిని కొనియాడుతున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున సాధ్యమైంది. తెలంగాణ చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకొని చరిత్ర పురా తవ్వకాలు జరిపారు.


తెలంగాణలో అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్ వారసత్వం సమున్నతంగా అమలవుతున్నది. వారి కఠోర పరిశ్రమ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోసే దశకు చేరుకున్నది. ఇట్లా అనేక నిర్మాణాల్లో ఇంజినీర్లు నవాజ్ జంగ్ స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


కాలం మట్టి దిబ్బల కింద కప్పిపెట్టబడిన మన చరిత్రను తవ్వి తీసి ప్రపంచానికి తెలియజెప్పినారు. మన జాతి నిర్మాతలను, మన వైతా ళికులను ఎందరినో వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తవ్వకాల్లో బయటప డిన కోహినూర్ వజ్రమే అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్. తెలంగాణ సాగు నీటిరంగ పితామహుడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా 2013 జూలైలో అచ్చువేశాం. ఆ పుస్తకానికి అద్భు తమైన ఆదరణ లభించింది. అది ఉర్దూలోకి అనువాదమై ఉర్దూ పాఠకు లకు కూడా అందింది. అలీ నవాబ్ జంగ్ హైదరాబాద్ రాజ్యంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజినీర్‌గా ప్రఖ్యాతిగాంచినాడు. దేశంలో సాగునీటి రంగానికి పునాదులు వేసిన తొలితరం మేధావి విశ్వేశ్వరయ్యకు సమకా లికుడు. అంతే ప్రతి భావంతుడైన ఇంజినీర్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్. వారిద్దరూ కలిసి మూసి నది వరద నియంత్రణ, తాగునీటి కోసం ఉస్మాన్‌సాగర్, హిమా యత్‌సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ సాగు నీటిరంగ చరిత్రలో సర్ ఆర్థర్ కాట న్‌కు, కెఎల్ రావుకు దక్కిన స్థానం, ఖ్యాతి అలీ నవాజ్‌జంగ్‌కు దక్కలేదు. కాటన్ తరహాలోనే హైదరాబాద్ రాజ్యంలో ఈ ప్రాంత భౌగోళిక స్థితిగ తులకు అను గుణంగా సమగ్ర సాగునీటి ప్రణాళికలు రచించి అనేక భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను, అనేక చారిత్రక భవనాలను, వంతెనలను, రోడ్లను నిర్మించిన అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌కు అటు వంటి ఖ్యాతి దక్కవలసింది. తెలంగాణ ఉద్యమ చైతన్యంతో తెలంగాణ ఇంజినీర్లు తమ ఘనమైన చరిత్రను తెలుసుకున్నారు. ఆ ఎరుకలో నుం చే జూలై 11న తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకొంటున్నాం.

ఆయన రూపొందించిన ఇంజినీరింగ్ నివేదికలు అపురూపమైనవి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు భారత జాతీయ కాంగ్రేస్ దేశాభివృద్ధి పథకాలపై నివేదికలు తయారుచేయడానికి నెహ్రూ అధ్యక్షతన 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ వివిధ అంశాలపై నిపుణులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అటువం టి సబ్ కమిటీల్లో సాగునీటి రంగంలో సమగ్ర నివేది కను తయారుచేయడానికి అలీ నవాజ్ జంగ్‌ను నెహ్రూ ఎంచుకున్నాడు. అప్పటికే హైదరాబాద్ రాజ్యం ఇంకా భారత్‌లో విలీనం కాలేదు. అప్పటి కే ప్రతిభావంతుడైన ఇంజినీర్‌గా దేశంలో గుర్తింపుపొందిన ఆయన రివర్ ట్రైనింగ్ ఇరిగేషన్ పేరుతో సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను రెండేండ్లలోనే నేషనల్ ప్లానింగ్ కమిటీకి సమర్పించాడు. స్వాతంత్య్రానం తరం నెహ్రూ ఆ సిఫార్సులను అమలుచేశాడు. ఆయన సిఫార్సుల మేరకే ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీఅ థారిటీ, పుణేలో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చి స్టేషన్ ఏర్పాటైనాయి. దేశంలో అన్ని నదుల పై గేజింగ్ స్టేషన్లు, దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని నమోదు చెయ్యడానికి రెయిన్‌గేజ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అన్ని ప్రధాన నదులపై భాక్రానం గల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. అలీ నవా జ్‌జంగ్ కలలు ఆయన మరణా నంతరం నిజమయ్యాయి. అలీ నవాజ్‌జంగ్ తన జీవిత కాలంలో అనేక ఉన్నత పదవు లను సమర్థవంతంగా నిర్వహిం చాడు. హైదరాబాద్ సహా దేశం లో నాటి యురోపియన్ ఇంజినీ ర్ల ఆధిపత్యాన్ని అధిగమించి ప్రజా పనుల విభాగానికి చీఫ్ ఇంజినీర్‌గా, ఆ తర్వాత సెక్రటరీగా పదో న్నతి పొందాడు. దేశంలోనే ఆయన మొదటి స్వదేశీ చీఫ్ ఇంజినీర్.
sridhar-rao-Deshpandey
హైదరాబాద్ ప్రజా పనుల శాఖకు చీఫ్ ఇంజినీర్-సెక్రటరీగా ఎంపికై నప్పుడు ఆయనకు చార్జ్ అప్పజెప్పిన హైదరాబాద్ రాజ్య చివరి బ్రిటిష్ చీఫ్ ఇంజినీర్ ఎటీ మెకంజీ, నేను నా బాధ్యతలను నాకంటే ప్రతిభావం తుడైన, నా కంటే గొప్ప పరిపాలనాదక్షుడికి అప్పజెపుతున్నానన్నాడు. 1948లో నవాబ్ చత్తారీ హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి పదవికి రాజీ నామా సమర్పించినప్పుడు కొత్త ప్రధానమంత్రి పదవికి అలీ నవాజ్‌జంగ్ పేరును కూడా నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ పరిశీలించినట్లు హైదరాబాద్ రాజ్య చివరి ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే హైదరాబాద్ రాజ్యానికి చివరి ప్రధాని గా చరిత్రలో నిలిచిపోయే ఒక విషాదం నుంచి తప్పించుకున్నాడు. తెలంగాణలో అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్ వారసత్వం సమున్నతంగా అమలవుతున్నది. ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోసే దశకు చేరుకున్నది. ఇట్లా అనేక నిర్మాణాల్లో ఇంజినీర్లు నవాజ్ జంగ్ స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి పాలనలో అలీ నవాజ్ జంగ్‌కు చేసిన అన్యాయా న్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నెలలోనే సవరించింది. అది ఆయ నకు అం తిమంగా లభించిన పోయెటిక్ జస్టిస్. శాశ్వత సముచిత గౌరవం.
(జూలై 11 తెలంగాణ ఇంజినీర్స్ డే..)

474
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles