బడ్జెట్‌లో తప్పుడు లెక్కలా?

Wed,July 10, 2019 01:03 AM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో గతేడాదితో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ, వ్యయాలను చేర్చలేదు. దీనిపై విస్తృత వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజానికి బడ్జె ట్ ప్రసంగం అంటేనే ఈ ఆదాయ వ్యయాల లెక్కలు ఉండాలె. పార్లమెంటుకు, సాధారణ ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తక్ష ణ అవగాహన కలుగాలె. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఈ వివరాలు ఎం దుకు లేవనే సందేహాలకు ఆర్థికమంత్రి ఇచ్చిన వివరణ-ఈ లెక్కలన్నీ బడ్జెట్ అనుబంధ పత్రాలలో ఉన్నాయనేది. అనుబంధాలలో ఉన్నందువల్ల తమ బడ్జెట్ ప్రసంగంలో చేర్చలేదనేది మంత్రి సమర్థింపు. కానీ చాలామంది బడ్జెట్ అనుబంధ పత్రాలను పట్టించుకోరు. అందువల్లనే ఆర్థికమంత్రులు బడ్జెట్ ప్రసంగంలో ఆదాయవ్యయాల లెక్కల సంగ్రహ సారాంశాన్ని బడ్జెట్ ప్రసంగ పాఠంలోనే చేరుస్తారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ ఆదాయవ్యయాల లెక్కలను ఎందుకు చేర్చలేదనే సందేహానికి సమాధానం ఎట్టకేలకు లభించింది. ఈ అనుబంధ పత్రాలలోని ఆదాయవ్యయాల వివరాలు తప్పుదోవ పట్టించేవిగానే కాదు, తప్పుల తడకగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు గతేడాది వివరాలు కూడా తప్పుగానే ఉన్నాయి. బడ్జెట్ ప్రసంగ పాఠం అనుబంధంలో తప్పులున్నాయనడానికి ఆధా రం 2018-19 ఆర్థిక సర్వేనే. ఇందులోని రెండవ సంపుటిలో గణాంకాల అనుబంధం ఉన్నది. ఇందులోని ఏ 59 పుటలో గల 2.5 పట్టికలో కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల లెక్కలున్నాయి. పట్టిక చివరి కాలం లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సొంత లెక్కల ప్రకారమే 2018-19 సంవత్సర తాత్కాలిక లెక్కలను చేర్చారు. నిజానికి సర్వే నివేదికను ఫిబ్రవరి లేదా మార్చిలో కాకుండా జూలై ఇచ్చారు.

ప్రభుత్వ ఆదాయవ్యయాల వివరాలను పార్లమెంటుకు, ప్రజలకు వెల్లడించాల్సిందే. పార్లమెంటు బడ్జెట్‌ను ఆమోదించే ముందు సవివర చర్చ సాగుతుంది. ఈ చర్చ ప్రధానంగా ఏ రంగానికి ఎంత కేటాయించారనే దానిపై కేంద్రీకరించి ఉంటుంది. ప్రభుత్వం కనుక ఏకపక్షంగా ఒక రంగానికి సంబంధించిన ఖర్చును తగ్గించి వేసినప్పుడు ఆ వివరాలను పార్లమెంటుకు, ప్రజలకు చెప్పాల్సిందే. వాస్తవ గణాంకాలకు బదులు అంతకుముందున్న సవరించిన అంచనాలను మాత్రమే వెల్లడించడం అంటే పార్లమెంటును అగౌరవపరుచడమే.


అందువల్ల 2019 మార్చి 31 వరకు ముగిసే ఆర్థిక సంవత్సరపు వాస్తవిక ఆదాయ, వ్యయ వివరాలను అందించవచ్చు. ఈ వివరాలు సీఏజీ కార్యాలయం నుంచి తీసుకున్నవి. కనుక సరైనవని భావించవచ్చు. అయితే ఈ గణాంకాలను పోల్చిచూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. బడ్జెట్ ప్రసంగంలోని ఆదాయ వ్యయ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి. 2018-19 లెక్కలను సవరించిన అంచనాలుగా చూపించారు. అయితే ఆర్థిక సర్వేతో పోల్చి చూసినప్పుడు, ప్రభుత్వ అంచనాలు, వాస్తవిక ఆదాయ వ్యయాలు సరైనవిగా లేవు. ఈ బడ్జెట్ అనుబంధంలోని గణాంకాలు అదే ఆర్థిక మం త్రిత్వ శాఖ నుంచి వస్తాయి కనుక ఈ పొంతన కుదరకపోవడం ఆశ్చర్యకరం. పైగా ఈ తేడా భారీగా ఉన్నది. బడ్జెట్ ప్రసంగ పాఠంలో ఈ ఆదా య వ్యయ వివరాలను చేర్చకపోవడానికి ఇదే కారణమా? కేంద్ర ట్యాక్స్ రెవెన్యూలలో తేడా ఎక్కువగా ఉన్నది. సవరించిన అం చనాల కన్నా ఈ వివరాలు 1,65,176 కోట్ల మేర తక్కువగా ఉన్నాయి. ఇది మొత్తం ట్యాక్స్ రెవెన్యూ సవరించిన అంచనాలో పదమూడు శాతం తేడా! ప్రభుత్వ ట్యాక్స్ రెవెన్యూ ఎందుకింత తక్కువగా ఉండటానికి కారణం- జీఎస్టీ వసూళ్ళలో తగ్గుదల. ఈ లోటును భర్తీ చేయడానికి కేంద్రం పొదుపు చర్యలను చేపట్టింది. మొత్తం వ్యయ సవరించిన అంచ నా 1,45,813 కోట్లు అంటే 13.4 శాతం. అంటే బడ్జెట్ జీడీపీలో ఒక శాతం మేర కుంచించుకుపోయింది. కానీ బడ్జెట్ వివరాలలో ఈ అం శాలు లేవు. పార్లమెంటుకు కానీ, సాధారణ ప్రజలకు కానీ వాస్తవాలను వెల్లడించలేదు. ఈ వ్యవహారసరళి అనేక సంక్లిష్టతలకు దారి తీస్తుంది. సవరించిన అంచనాలో 10,963 కోట్లుగా చెప్పిన దానికన్నా ఆర్థిక లోటు ఎక్కువగా ఉన్నది. జీడీపీలో 3.3 శాతమని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి 3.45 శాతంగా తెలుస్తున్నది. తాత్కాలిక గణాంకాలతో పోల్చినప్పుడు 2018-19 సవరించిన అంచనాలేవీ పొంతన కుదరవు. ఇది ప్రభుత్వం పెట్టే ఖర్చు తీరుపై ప్రభావం చూపుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉండటం వల్ల మరో విషయం వెల్లడవుతున్నది. జీడీపీ లెక్కలపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. కొత్తగా వెల్లడించిన గణాంకాల ప్రకారం- గతేడాది మొత్తం ట్యాక్స్ రెవెన్యూలు 9.2 శాతం మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం చెప్పిన 11.3 శాతం పెరుగుదల కన్నా ఇది చాలా తక్కువ. ఈ తగ్గుదలకు కారణం పరోక్ష పన్నులే. అంటే జీఎస్టీయే కారణం. పరోక్ష పన్ను ఆదాయం పెరుగుదల రేటు ఇంకా తక్కువగా ఉండి ఉంటుంది. సాధారణంగా పరోక్ష పన్నులు నామమాత్ర జీడీపీకి అనుగుణంగా ఉంటాయి. టర్నోవర్‌ను ప్రతిఫలిస్తాయి. అయితే పన్ను ఎగవేత హటాత్తుగా పెరిగిందా? లేక జీడీ పీ అంకెలపై వెల్లడైన సందేహాలు సరైనవేనా? తక్కువ ట్యాక్స్ రెవెన్యూ అంకెలు ప్రమాద హెచ్చరికను సూచిస్తున్నాయి.


అందుకే గతే డాది పన్ను వసూళ్ళు తగ్గే కొద్దీ వివిధ వ్యయాలలో కోతలు పడ్డాయి. జీఎస్టీ అమలు ఎంత అధ్వాన్నంగా ఉన్నదో దీనివల్ల తెలుస్తున్నది. అయి తే ప్రభుత్వం జీఎస్టీ వసూళ్ళు తగ్గిన నేపథ్యంలో ఏయే పద్దులలో కోత పెట్టిందో పార్లమెంటుకు, ప్రజలకు చెప్పలేదు. ప్రభుత్వ ఆదాయవ్యయాల వివరాలను పార్లమెంటుకు, ప్రజలకు వెల్లడించాల్సిందే. పార్లమెంటు బడ్జెట్‌ను ఆమోదించే ముందు సవివర చర్చ సాగుతుంది. ఈ చర్చ ప్రధానంగా ఏ రంగానికి ఎంత కేటాయించారనే దానిపై కేంద్రీకరించి ఉంటుంది. ప్రభుత్వం కనుక ఏకపక్షంగా ఒక రంగానికి సంబంధించిన ఖర్చును తగ్గించి వేసినప్పుడు ఆ వివరాలను పార్లమెంటుకు, ప్రజలకు చెప్పాల్సిందే. వాస్తవ గణాంకాలకు బదు లు అంతకుముందున్న సవరించిన అంచనాలను మాత్రమే వెల్లడించ డం అంటే పార్లమెంటును అగౌరవపరుచడమే. పార్లమెంటుకు, ప్రజల కు అబద్ధాలు చెప్పడమే. ప్రభుత్వం ఇదేవిధంగా తప్పుల తడకలుగా బడ్జెట్ పత్రాలను రూపొందిస్తూ పోతే ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గుతుంది. ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టడం మంచిది కాదు. దీనివల్ల ఇక ప్రభుత్వం చెప్పే లెక్కలను నమ్మే పరిస్థితి ఉండదు. ఇది చాలా ప్రమాదకర పోకడ. ప్రభుత్వం గత బడ్జెట్ వ్యయానికి సంబంధించిన వాస్తవాలను దాచి పెడుతున్నది. దీనివల్ల ప్రజలకు సందేహాలు కలుగుతాయి. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని అంచనాలను నమ్మవచ్చా అనే సందేహాలు తలెత్తుతాయి. ప్రభుత్వం తాత్కాలిక వాస్తవిక లెక్కలను మనం ఆమోదించినట్టయితే తాజా 2019- 20 బడ్జెట్‌లోని రెవెన్యూ పెంపుదల ప్రతిపాదనలు ఆశాజనకంగా కనిపిస్తాయి. కానీ అవి వాస్తవా లు కాదు. ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే అయితే-ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూల పెరుగుదల 25.3 శాతం ఉండాలె. అంటే గతేడాది కన్నా నాలుగు లక్షల కోట్ల మేర ఉండాలె.
jayati-ghosh
నామమాత్ర జీడీపీ పెరుగుదల 12 శాతంగా భావిస్తే ఈ లెక్కలు సరిపోతాయి. కానీ అది సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం చెబుతున్న ఆదాయం లక్ష్యాన్ని చేరుకోదో, అప్పుడు ఏడాది మధ్యలో నిధుల కొరత ఏర్పడుతుంది. ఈ కొరత మూలంగా వివిధ రంగాలకు చేసిన కేటాయింపులలో కోతలు పెట్టకతప్పదు. అయితే ఆ కోతలను బయటకు చెప్పరు. దానికి పార్లమెం టు ఆమోదం ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉండటం వల్ల మరో విషయం వెల్లడవుతున్నది. జీడీపీ లెక్కలపై కూడా అనుమానాలు కలుగుతున్నా యి. కొత్తగా వెల్లడించిన గణాంకాల ప్రకారం- గతేడాది మొత్తం ట్యాక్స్ రెవెన్యూలు 9.2 శాతం మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం చెప్పిన 11.3 శాతం పెరుగుదల కన్నా ఇది చాలా తక్కువ. ఈ తగ్గుదలకు కారణం పరోక్ష పన్నులే. అంటే జీఎస్టీయే కారణం. పరోక్ష పన్ను ఆదాయం పెరుగుదల రేటు ఇంకా తక్కువగా ఉండి ఉంటుంది. సాధారణంగా పరోక్ష పన్నులు నామమాత్ర జీడీపీకి అనుగుణంగా ఉంటాయి. టర్నోవర్‌ను ప్రతిఫలిస్తాయి. అయితే పన్ను ఎగవేత హటాత్తుగా పెరిగిందా? లేక జీడీ పీ అంకెలపై వెల్లడైన సందేహాలు సరైనవేనా? తక్కువ ట్యాక్స్ రెవెన్యూ అంకెలు ప్రమాద హెచ్చరికను సూచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే రెవెన్యూలు కూడా ఆశించిన దానికన్నా చాలావరకు పడిపోయి ఉంటాయి. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలలో సంక్షోభాన్ని సృష్టిస్తుం ది. కేంద్ర పన్నులు, జీఎస్టీ రెవెన్యూల నుంచి వచ్చే వాటా ఆధారంగా రాష్ర్టాలు తమ బడ్జెట్‌లను తయారు చేసుకుంటాయి. ఏదేమైనా గతేడాది తక్కువగా వచ్చిన పన్ను వివరాలు చాలా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ సందేహాలను తీర్చాలె. అవసరమైతే ఆదాయ వ్యయాల అంచనాలను సవరించుకొని కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాలె.
(వ్యాసకర్త: జవహర్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్)
ది వైర్ సౌజన్యం తో...

278
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles