మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ


Tue,July 23, 2019 12:32 AM

కొల్చారం: పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ కొనసాగుతుందని కొల్చారం జెడ్పీటీసీ మేఘమాల సంతోశ్, ఎంపీపీ మంజుల కాశినాథ్‌లు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రెండు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. మండల పరిధిలోని ఏటిగడ్డమాందాపూర్, కోనాపూర్, కొల్చారం గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం పండుగలా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమేశ్, కరెంటు ఉమారాజాగౌడ్, ఎంపీటీసీలు అరుణ కృష్ణాగౌడ్, ఆరట్ల ఎల్లయ్య, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఉపాధిహామీ పథకం ఏపీవో మహిపాల్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు దుర్గయ్య, నిర్మల, ఆంజనేయిలు పాల్గొన్నారు.

హరితహారాన్ని విజయవంతం చేయాలి
సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని శీలాంపల్లి సర్పంచ్ కవితాముకుందరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని శీలాంపల్లి గ్రామ శివారులోని ఉపాధిహామీ కూలీలతో కలిసి సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...