ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


Tue,July 23, 2019 12:31 AM

చేగుంట: పేద ప్రజల సంక్షమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యమని జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన చేగుంటకు వచ్చిన సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవీలు మొక్కను అందజేసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు, వితంతులకు, బీడి, చేనేత కార్మికులకు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ డబ్బులను రెట్టింపు చేశారన్నారు. రైతుల కోసం పెట్టుబడి సాయం, రైతుబీమాతో పాటు సాగు నీటికోసం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా వచ్చే నీటీతో బీడు భూములు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జెడ్పీ సీవో విజయలక్ష్మి, ఏపీవో ఆదినారాయణ, మక్కరాజిపేట సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, నాయకులు భాగ్యరాజ్ ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...