ఆరుతడి పంటలతో లాభాలు


Tue,July 23, 2019 12:31 AM

హవేళిఘనపూర్: ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి వరిసాగు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుము, పెసరు, కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంను సాగు చేసి అధిక దిగుబడులతో మంచి లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ శ్యాంసుందర్ అన్నారు. మండల కేంద్రమైన హవేళిఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అధ్యక్షతన ఆరుతడి పంటలపై మండలంలోని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సైంటిస్ట్ శ్యాంసుందర్ మాట్లాడుతూ తక్కువ నీటితో ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చన్నారు. సేంద్రియ పంటలను సాగు చేస్తే మరింత ఫలితాలుంటాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకుంటే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి వాటిని వినియోగించినా కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం డ్రిప్‌కు 90శాతంపై సబ్సిడీపై అందజేస్తుందన్నారు. పంటలు మార్పు చేసి పంటలు వేసినట్లయితే రైతులకు అన్ని రకాలుగా మేలు ఉంటుందన్నారు. రోగాలు సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే తదితర అంశాలపై ఆయన క్షణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, ఇన్‌చార్జీ ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగమాధురి, మండల పరిధిలోని రైతులు శ్రీకాంత్, జయపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మంగ్యా, యాదాగౌడ్, రమేశ్, ఉద్యానవన శాఖ అధికారులు అర్చన, ఏఈవో భార్గవ్‌తో పాటు ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...