ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ


Tue,July 23, 2019 12:31 AM

మెదక్ మున్సిపాలిటీ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అబ్బాసుబి భర్త ఖజామియా తనకు సాదుల్ల, అబ్దుల్లా ఇద్దరు కుమారులని తన ఆస్తిని తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచి తాను బతుకడానికి తనకు గల సర్వే నంబర్ 45/2ఆ, 46 విస్తీర్ణం 1.07 గుంటల భూమి నా పేరుపైన ఉన్నది. ఇప్పుడు పెద్ద కుమారుడు తన పేరుపైన ఉన్న భూమిని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడు. ఇదేమిటని అడిగితే నన్ను చంపేస్తానని అంటున్నాడని, నాకు న్యాయం చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శివ్వంపేట మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పెద్దకోళ్ల ఇందర భర్త భిక్షపతి తన భర్త సంగారెడ్డి డిపోలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తప్పెట్ల లక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇదేంటని అడిగితే ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని ఇంట్లో ఉన్న వారందరినీ బెదిరిస్తున్నాడని, నన్ను చాలా సార్లు కొట్టాడు.. తప్పెట్ల లక్ష్మిపైన చర్యలు తీసుకొని తనకు తగిన న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...