తండాలపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం


Sun,July 21, 2019 11:43 PM

చిలిపిచెడ్: రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తాయి. స్వరాష్ర్టాన్ని సాధించుకున్న అనంతరం బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతున్నది. సీఎం కేసీఆర్ తండాలు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎన్నో యేండ్ల నుంచి రోడ్డు లేని తండాలకు రోడ్లు వేయడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మండలంలోని చిట్కుల్ బద్రియాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని చండూర్ గూజిరి తండా గ్రామాల మీదుగా గౌతాపూర్ రోడ్డు వరకు సుమారు 5 కిలోమీటర్లు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి 98లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడడంతో గిరిజనులకు రవాణా కష్టాలు తీరనున్నాయి. బద్రియాతండా ఏర్పాటైనప్పటి నుంచి గత పాలకుల పట్టింపు లేనితనంతో బద్రియ గ్రామ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. చిట్కుల్ గేటు నుంచి బద్రియాతండా, గూజిరి తండా మీదుగా గౌతాపూర్ రోడ్డు వరకు ఉన్న మట్టిరోడ్డు అధ్వానంగా ఉండేది. మండలంలో ఈ తండా ప్రజలు నిత్యం ఇదే రోడ్డు గుండా మండలానికి రాకపోకలు చేస్తుంటారు. గతంలో ఈరోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవని గ్రామస్తులు వాపోయారు. తండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని పలుమార్లు అధికారులను, నాయకులకు విన్నవించినా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచిన తర్వాత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో మారుమూల తండాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చిట్కుల్ గేటు నుంచి గౌతాపూర్ రోడ్డ్డు వరకు సుమారు 5 కిలోమీటర్లు వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...