అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు


Sun,July 21, 2019 11:42 PM

వెల్దుర్తి : అర్హులైన వారందరికీ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పులింగాపూర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని, గ్రామంలో అర్హులైన వారందరిని ఎంపిక చేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు గూడు లేక గుడిసెల్లో తలదాచుకుంటున్నారన్నారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం నిర్మాణాలు జరుగుతున్నాయని, వెల్దుర్తితో పాటు పలు గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే వాటిని నిరుపేదలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, నర్సాపూర్ అశోక్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ జెగ్గ అశోక్, మైసయ్య, చందు, ఖాజాలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...