అర్హులందరికీ పింఛన్లు


Sat,July 20, 2019 11:28 PM

చిన్నశంకరంపేట : అర్హులైనవారందరికీ ఆసరా పింఛన్లను అందిస్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం చిన్నశంకరంపేటలోని శ్రీనివాసగార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం పింఛన్లను వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు గీత కార్మికులకు, చేనేత, బీడీ కార్మికులకు రూ.1000 నుంచి 2016కు పెంచడం జరిగిందన్నారు. వికలాంగుల పింఛన్‌ను రూ.1500 నుంచి 3016కు పెంచినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి బీడీ కార్మికులకు జీవన భృతిని అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూంలను నిర్మించి ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చిన్నశంకరంపేట మండలానికి 19వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. చేతి వృత్తుల వారికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పట్లోరి మాధవి, వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ సుంకరి రాధిక, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...