పెంచిన పింఛన్లతో మానసిక ధైర్యం


Sat,July 20, 2019 11:27 PM

తూప్రాన్, నమస్తే తెలంగాణ : పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు ఎంతగానో మానసిక ధైర్యం కల్పిస్తున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. గజ్వేల్‌లో శనివారం ఏర్పాటు చేసిన పెంచిన ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమ ఆవరణలో తూప్రాన్ జెడ్పీటీసీ బస్వన్నగారి రాణి సత్యనారాయణ, మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీతా, తూప్రాన్ ఎంపీపీ స్వప్నలతో కలిసి తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన ఎంపికైన లబ్ధిదారులకు ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్లపై ఆధారపడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. వృద్ధులకు పెద్ద కొడుకులా పింఛన్ల రూపంలో ఆదుకుంటున్నారని అన్నారు. పింఛన్లు రెట్టింపు చేసి రూ.2016, రూ.3016 పంపిణీ చేస్తుండటంతో ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ఎంపీడీవోలు రాఘవరావు, అశోక్‌కుమార్‌లతో పాటు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, పురం రవి, సత్యనారాయణలతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...