కూరగాయల పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు


Fri,July 19, 2019 02:44 AM

చేగుంట: నార్సింగి మండలం సంకాపూర్ గ్రామంలోని రైతులకు సంబంధించిన కూరగాయల పంటలను (తునికి)కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. సంకాపూర్‌లో రైతులు వేసిన కూరగాయల పంటలపై కాండం తొలుచు, కత్తెర పురుగుల ఆశించడాన్ని గమనించారు. పంట రక్షణ కొరకు తీసుకునే సస్యరక్షణ చర్యలు, లింగఆకర్ష బుట్టలను రైతులకు ఉచితంగా అందజేశారు. పంట పొలాల్లో కలుపుతీసేందుకు పవర్‌వీడర్లను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో నార్సింగి మండలరైతు సమన్వకమిటీ అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, శాస్త్రవేత్తలు నరేశ్, ఉదయ్, గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ కేశవులు, ఏఈవో దివ్య, రైతులు ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...