పట్టుదలతో చదవాలి


Fri,November 8, 2019 04:05 AM

-బీసీ స్టడీ సర్కిల్ జిల్లా సంచాలకుడు విజయ్‌కుమార్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు పట్టుదలతో చదవాలని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు విజయ్‌కుమార్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు పలు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ ఎస్పీడీసీఎల్ ద్వారా విడుదలైన జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు పోటీ పడే నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ - కం- కంప్యూటర్ ఆపరేటర్ శిక్షణకు 15 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరికి 30 రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా సబ్జెక్టులలో నిపుణుడు, అనుభవజ్ఞులైన భోజరాజుతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు క్రమం తప్పకుండా శిక్షణా తరగతులకు హాజరు కావాలని కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...