పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు : ఎస్పీ


Fri,November 8, 2019 04:05 AM

మహబూబ్‌నగర్ క్రైం : శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేవిధంగా తప్పుడు వదంతులను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. శాంతి భద్రతల విషయమై ప్రజలకు ఎలాంటి సందేహాలు, సమాచారం ఉనా సమీప పోలీసు అధికారులను నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. అల్లరి మూకల పట్ల వివిధ సామాజిక మాద్యమాలలోని పోస్టింగ్స్‌పై పూర్తి స్థాయిలో పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కుటుంబ పెద్దలు పిల్లల వ్యవహార శైలిపై దృష్టి సారించాలని కోరారు. అల్లర్లకు బాధ్యులయ్యే వ్యక్తులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులు ఎంతటి వారైనా న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...