ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి


Thu,November 7, 2019 12:48 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండి సన్మార్గంలో నడవాలని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని నీలకంఠస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ సమకూర్చిన నూ తన కలశాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి తనికెళ్ల భరణి మాట్లాడుతూ ప్ర జలు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ జీవితం కష్టం గా ఉందని భావిస్తుంటారని తెలిపారు. కష్టాన్ని ఆ స్వాదించి మరింత శ్రమిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమన్నారు. నీలకంఠస్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు చెన్న వీరయ్య, బలరాం, ఆంజనేయు లు, రాము లు, అంజయ్య, లక్ష్మణ్, గడిగే అంజ య్య, కాళ్ల రా ములు, లక్ష్మీనారాయణ, రాంచంద్ర య్య, రాము, ప్రణయ్, వినోద్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...