హెచ్‌సీఏ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ గెలుపు


Thu,November 7, 2019 12:48 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు గెలుపొందింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు డబ్ల్యూఎంసీసీ జట్టుపై 513 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో గణేశ్ 192 బంతుల్లో 40 ఫోర్లు, 17 సిక్స్‌లతో 329 పరుగులు చేసి తన కేరీర్‌లో రెండో ట్రిఫుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. జట్టులో హర్షవర్దన్ 49, ఖయ్యూం 18, కేశవులు 78, హబీద్ హుస్సేన్ 69 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 110 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. రెండో బ్యాటింగ్ చేసిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో అక్షయ్ 28, హర్షపటేల్ 28, శరత్ 28 పరుగులు సాధించారు. జిల్లా బౌలర్లలో ఖయ్యూం 3, రుశిద్ర 2 వికెట్లు తీశారు. జట్టు విజయం సాధించడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని క్రీడాకారులకు సూచించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...