చట్టాలపై అవగాహన కల్పించాలి


Thu,November 7, 2019 12:48 AM

-జిల్లాలో బాలికా సాధికారిత క్లబ్‌లు ఏర్పాటు చేయండి : డీఈవో
స్టేషన్ మహబూబ్‌నగర్ : బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించాలని డీఈవో ఉషారాణి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బాలికల చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 14 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 12 హైస్కూళ్లను ఎంపిక చేశామని, ఇందులో బాలికా సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మూడో శుక్రవారం ఆయా పాఠశాలల్లో సమీక్షా సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను దృష్టిలో ఉంచుకొని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై బాలికలకు వివరించాలన్నారు. క్లబ్‌లో చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయుడు, ఫ్రెండ్లీ టీచర్, 10 మంది బాలికలు, కన్వీనర్‌గా ఫ్రెండ్లీ టీచర్, 10 మంది బాలికలు, ఆయా శాఖల సభ్యులను నియమించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...