కలెక్టర్‌కు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అవార్డు


Thu,November 7, 2019 12:48 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అవార్డు లభించింది. జిల్లాలో ఎన్‌ఐసీ ద్వారా అందిస్తున్న వివిధ సేవలకుగా నూ బుధవారం ఢిల్లీలోని గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ సీఆర్‌ఐఎస్, ఐటీ కాస్క్ ఫోర్స్ స భ్యుడు వినిత్ గోయింక కలెక్టర్‌కు అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రంలోనే ఈ-ఆఫీస్ సేవలను వేగంగా అమలు చేసిన ఘనత పాలమూరు జిల్లాకు దక్కింది. కలెక్టర్‌కు అ వార్డు రావడం పట్ల జేసీ స్వర్ణలత, ఏవో ప్రేమ్‌రాజ్, ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో ఎన్‌ఐసీ జిల్లా అధికారి సత్యనారాయణమూర్తి, మేనేజర్ వాసుదేవరావు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...