బాధిత కుటుంబాలకు టీఆర్‌ఎస్ చేయూత


Thu,November 7, 2019 12:47 AM

మూసాపేట : టీఆర్‌ఎస్ సభ్యత్వం పొంది మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు ఆ పార్టీ అండగా నిలిచింది. పార్టీ సభ్యత్వం పొందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే..మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన పల్లి వెంకటయ్య, మీనిగ సత్యమ్మలు టీఆర్‌ఎస్ సభ్యత్వం పొందారు. వారు ఇటీవల మృతి చెందారు. ఆయా కుటుంబాలకు టీఆర్‌ఎస్ తరఫున రూ. 2లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వారి కుటుంబ సభ్యులు పల్లి రాములు, ఎం మధుసూధన్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఉద్యమకారుడు శివరాములు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ నక్క ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు టీఆర్‌ఎస్ అండగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి కేటీఆర్, ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...