శ్రీశైలానికి 48వేల క్యూసెక్కులు


Wed,November 6, 2019 02:50 AM

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం గేట్లన్నీ మూసుకొన్నాయి. రెండు వారాలుగా ఎగువన జూరాల, సుంకేసుల నుంచి భారీగా వచ్చిన వరద జలాలతో తెరుచుకున్న గేట్లు గత గురువారం నాటికి ఇన్‌ఫ్లో తగ్గడంతో మూతపడ్డాయి. ఈ వర్షాకాలంలో ఆగస్టు నుంచి కురిసిన వర్షాలతో ఏడోసారిగా గేట్లు తెరిచిన అధికారులు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకు వచ్చిన వరదతో ప్రాజెక్టు నీటి మట్టాలు మాత్రం గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885అడుగులు కాగా మంగళవారం నాటికి 882అడుగులకు చేరుకొంది. అలాగే 215టీఎంసీల నీటి నిల్వకు గాను 203టీఎంసీల స్థాయిలో ఉంది. ఇక జూరాల నుంచి కేవలం 37,404క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 11,238క్యూసెక్కుల చొప్పున 48,642క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేయగా కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి నిరంతరాయంగా జరుగుతోంది. దీనికిగాను 70వేల క్యూసెక్కుల నీళ్లు బయటకు వెళ్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సదస్సుకు అఖిలేశ్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ టౌన్‌: చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించే ఐక్యరాజ్యసమితి సదస్సుకు నాగర్‌కర్నూల్‌ జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అఖిలేశ్‌రెడ్డి ఎంపికయ్యారు. డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 49 దేశాల ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు పరిచిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి అఖిలేశ్‌రెడ్డి కొల్లాపూర్‌ మండలానికి ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించారు. కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికకు సంబంధించిన కేస్‌స్టడీ వ్యక్తిగత చరిత్ర నివేదికను ఐక్యరాజ్యసమితికి నివేదించారు. అందుకు ఆకర్శితులైన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చైనా రాజధాని బీజింగ్‌ తసింఘా యూనివర్సిటీలో స్వీచ్‌ ఏషియా లీడర్శిప్‌ అకాడమీ అన్‌ సర్కూలర్‌ ఎకానమీ సెమినార్‌లో ప్రణాళిక తీరుతెన్నులను నివేదించడానికి అఖిలేశ్‌రెడ్డిని ఆహ్వానించింది. భారతదేశం నుంచి ముగ్గురికి ఆహ్వానం అందగా అందులో తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి 2017వ సంవత్సరం గ్రూప్‌-1 బ్యాచ్‌కు చెందిన తలసాని అఖిలేశ్‌రెడ్డి ఎంపికయ్యారు. జిల్లా వాసి కావడంపై కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమ అధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే పూర్తి ఖర్చులను ఐక్యరాజ్యసమితి భరించనున్నది. ఈ సందర్భంగా అఖిలేశ్‌రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళికలో సహకరించి, అంతర్జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యేలా ప్రోత్సహించిన కలెక్టర్‌కు శ్రీధర్‌కు, తోటి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...