వార్డుల్లో సమస్యల పరిష్కరానికి కృషి


Wed,November 6, 2019 02:50 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కరానికి అన్నివిధాల కృషి చేస్తున్నామని స్పెషల్‌ కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం 37వ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలోని వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రణాళిక నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వార్డులో పారిశుధ్యంపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నామని, రోడ్డు, ఇళ్ల మధ్య చేస్తే పురపాలిక శాఖ జరిమానా విధిస్తుందన్నారు. ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 28వ వార్డులో డీవైఎస్‌వో సత్యవాణి ఆధ్వర్యంలో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించి అక్కడ నోటీసులు అతికిస్తున్నారు. రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానాకు సంబంధించి వార్డులో స్టికర్లు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు అమ్మవద్దని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ కృష్ణ, డీఈ బెంజమిన్‌,ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌, ఆయా శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు.నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 48 ఆర్టీసీ, 28 హైర్‌ బస్సులు నడిపించారు. ప్రయాణికులకు అవసరమైన సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచుకుంటూ అవసరమనై ప్రతి ప్రాంతానికి బస్సులను తిప్పారు. నెలరోజులకు పైగా ఆర్టీసీ అధికారులు తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తూ ప్రతి సమస్యను అధిగమిస్తు ముందుకు సాగుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్టీసీ ప్రయాణం సాగుతుంది. ఈ బస్సులతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7వేలకు పైగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఏవోకు రిపోర్టు చేసిన ఓకే..
కలెక్టరేట్‌లో ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేక ఫ్లెక్సీని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరైనా విధుల్లో చేరాలి.. అనుకుంటే కలెక్టరేట్‌ ఏవోకు రిపోర్టు చేయాలని సమాచారం తెలియజేశారు. మంగళవారం రాత్రి 12గంటల వరకు కూడా అధికారులు అందుబాటులో ఉంటారని.. అధికారులు తెలియజేశారు. కలెక్టరేట్‌ ఏవోకు రిపోర్టు చేసిన ఆర్టీసీకి సమాచారం అందిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని ఇప్పటికే పోలీస్‌ అధికారులు వెల్లడించిన విషయం విధితమే. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ప్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఎవరైనా జాయిన్‌ అవుతారా అనే సందేహాలు మంగళవారం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో సంతరించుకున్నాయి.

కొనసాగిన ఆర్టీసీ కార్మికుల నిరసనలు
ఆర్టీసీ కార్మికులు యథావిధిగా తమ నిరాహార దీక్షలతో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు జీఎల్‌ గౌడ్‌, డీఎస్‌ చారి, కేఆర్‌ రెడ్డి, వీరాంజనేయులు, భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సానుకూలంగా తమ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...