మారిన గ్రామాల రూపురేఖలు


Tue,November 5, 2019 12:39 AM

-30 రోజుల ప్రణాళికతో స్వచ్ఛ పల్లెలుగా..
-దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు దూరం
-పంచాయతీరాజ్ చట్టంతో సర్పంచులకు గౌరవం
-ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌లతో కలిసి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల స్వరూపమే మారిపోయిందన్నారు. పనిచేసే సర్పంచులకు ప్రజల్లో ఎంతో మంచి పేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో 30 రోజుల ప్రణాళిక అనంతరం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యధికంగా ట్రాక్టర్లను వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ కావడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి రూపదిద్దుకున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనంతరం గ్రామాల్లో రూపురేఖలు మారిపోయినట్లు ఆయన వివరించారు.

పని చేసే సర్పంచులకు గ్రామాల్లో ఎంతో గౌరవం పెరిగిందన్నారు. మా సర్పంచు మంచిగా పనిచేస్తున్నాడు.. అనేలా విధంగా పేరు తెచ్చుకునాలన్నారు. ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మొదట సర్పంచుగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాతే ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో మంచి పథకాలు తెస్తున్నారన్నారు. పల్లె ప్రగతితో దీర్ఘకాలిక సమస్యలు దూరమయ్యాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం జడ్చర్ల, దేవరకద్ర జీపీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉన్నాయని.. ఇప్పుడు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. అలాగే, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.

పల్లెల అభివృద్ధితోనే దేశం బాగుపడుతుంది
-జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని గాంధీజీ పేర్కొన్న ప్రకారం గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. గాంధీజీ ఆలోచనలకు సీఎం కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి ప్రతిరూపమన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా బడ్జెట్‌లో నిధులు కేటాయించి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిని బట్టి ఏటా రూ. 8లక్షల నుంచి రూ. 30 లక్షల నిధులు వస్తున్నాయన్నారు. గతంలో గ్రామాల్లో ఎప్పుడు ఇంత అభివృద్ధి జరగలేదన్నారు. పల్లె ప్రగతి కారణంగా ఇప్పుడు సర్పంచులకు మంచి పేరు వస్తుందన్నారు. 30 రోజుల కార్యక్రమం నిరంతరం కొనసాగించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మలేరియా, డెంగీ రావన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమం గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగించాలన్నారు. ఇంకుడు గుంతలు 100శాతం చేపట్టాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం వల్ల దోమల బెడద తగ్గుతుందన్నారు.

పల్లెప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయి..
-కలెక్టర్ రొనాల్డ్ రోస్
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు బాగు పడ్డాయని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గ్రామా ల్లో సర్పంచులు, గ్రామస్తులు వివిద అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎంతో కష్టపడ్డారని ఆయన గుర్తు చేశారు. 30 రోజుల ప్రణాళిక విజయవంతం కావడంలో ప్రతి కార్యదర్శి బాధ్యత వెలకట్టలేనిదన్నారు. ఇప్పటి వరకు చేసినట్లే భవిష్యత్తులోనూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రాక్టర్, ట్రాలీ, డోజర్, ట్యాంకర్ వంటి అత్యవసర యంత్రాలు గ్రామ పంచాయతీలకు ఉండాలన్నారు. అందుకే వాటిని డీలర్లతో మాట్లాడి తక్కువ ధరల్లోనే ఇప్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, తొలి విడతగా జిల్లాలోని 40 గ్రామ పంచాయతీల సర్పంచులకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర సంగీత, నాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచుల సం ఘం అధ్యక్షుడు ప్రణిల్, సీఈవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...