జాతీయ స్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి


Tue,November 5, 2019 12:37 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రతిభ కనబర్చి విజేతగా నిలవాలని ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రతిభ కనబర్చిన క్రీ డాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులను సోమవారం టీఎన్‌జీవో భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అభినందించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడ ల్లో రాణించాలని సూచించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 11 నుంచి 15వరకు జరగనున్న జాతీయ స్థా యి ఎస్‌జీఎఫ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీలో రాష్ట్ర జట్టు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పేట టీఎస్ అధ్యక్షుడు జగన్మోహన్‌గౌడ్, హాకీ అధ్యక్షుడు గోటూరు శ్రీనివాస్‌గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నిరంజన్‌రావు, పరుశరాం తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టు వివరాలు..
బాలుర జట్టుకు లోకేశ్ (మెదక్), వెంకట్ అభినవ్ కృష్ణ, శశాంక్ సాయి (హైదరాబాద్), తారక్ శ్రీనివాస్ (నల్గొండ), జెట్టి హర్ష (రంగారెడ్డి), బాలికల జట్టుకు డీవీ లావణ్య, శర్వతి, రెహెనా జరీన్, రోహితారెడ్డి (హైదరాబాద్), అనితారెడ్డి (ఖమ్మం)లు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...