అమర్థ్యాసేన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి


Tue,November 5, 2019 12:37 AM

పాలమూరు యూనివర్సిటీ : ఆసియాలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన అమర్థ్యాసేన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నూ ర్జాహాన్ అన్నారు. సోమవారం పీయూ ఎంబీఏ, ఎకనామిక్స్ విద్యార్థులతో కలిసి అమర్థ్యాసేన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అమర్థ్యాసేన్ విద్యార్థి దశ నుంచే ఎన్నో ప్రయోగాలు చేశారని, ఆయన చేసిన ప్రయోగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, అధ్యాపకులు జమ్మీ కాస్టిన్, రాఘవేందర్, శివలింగం, వినయ్, కరుణాకర్, విశ్వనాథ్, అర్జున్‌కుమార్, నాగరాజు, విద్యార్థులు జయమ్మ, నాగసుధ, జావెద్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...