పరిశోధనలపై దృష్టి సారించాలి


Tue,November 5, 2019 12:37 AM

-పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పవన్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్ : విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన క్వెస్ట్ - 2019 కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన శాస్ర్తాన్ని అర్థం చేసుకొని పరిశోధనల దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రయోగాల ఫలితాన్ని మానవాళి మనుగడ కోసం ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులు ఆధునిక ప్రపంచంలో సరికొత్త ఆలోచన, దృక్ఫథాలతో ముందుకు వెళ్లాలన్నారు. భవిష్యత్తులో పరిశోధకులుగా ఎదిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ బొంస్లే మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా క్వెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు 33 మంది జీవశాస్త్రం. 6మంది రసాయన శాస్త్రం విద్యార్థులు ప్రసంగించారు. మంగళవారం భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, గణిత శాస్త్రం, వాణిజ్యశాస్త్రం విద్యార్థులు పాల్గొని ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఫణిప్రసాదరావు, వెంకటేశ్వర్లు, రాఘవేంద్రప్రసాద్, శ్రీలత, కళ్యాణి, అర్షియా సుల్తానా, అలివేలు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...