పేదల కడుపు నింపడమే లక్ష్యం


Tue,November 5, 2019 12:37 AM

-ఇడ్లీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పేదల కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ భోజనశాలలో ఏర్పాటు చేసిన ఇడ్లీ సెంటర్‌ను కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణ భోజనశాలలో ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ఉదయం వేళలో పేదల కడుపు నింపేందుకు రూ.5కు నాలుగు ఇడ్లీల చొప్పున అందిస్తారన్నారు. పేదలు ఇడ్లీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, సింగిల్‌విండో చైర్మన్ కొరమోని వెంకటయ్య, డీఎఫ్‌వో గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...