పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం


Tue,November 5, 2019 12:36 AM

-30 రోజుల ప్రణాళికలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : మహబూబ్‌నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం బండమీదిపల్లిలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి పర్యటించారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రాజీవ్ గృహకల్పలో రూ.25లక్షలతో చేపట్టనున్న పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లలో చేసి చూపిందన్నారు. మయూరి పార్కును అభివృద్ధి చేస్తే జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు వారు కూడా సందర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామన్నారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికార యంత్రాంగం వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, మాజీ కౌన్సిలర్ లింగమయ్య, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, నాయకులు గోపాల్‌యాదవ్, మున్సిపల్ ఎంఈ సత్యనారాయణ, పారిశుధ్య విభాగం అధికారి సయ్యద్ మొహియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...