చార్‌ధామ్‌యాత్ర పుస్తకావిష్కరణ


Mon,November 4, 2019 02:36 AM

త్యాగరాగానసభ: ఇనుగంటి నవనీతరావు(కరీంనగర్)రచించిన చార్‌ధామ్ యాత్ర పుస్తకావిష్కరణను గానసభలో మానస ఆర్ట్స్ అధినేత కవి రఘుశ్రీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీవీ జగన్మోహన్‌రావు, డాక్టర్ నోరి రాజేశ్వరరావు, పాలపర్తి సంధ్యారాణి, డాక్టర్ లలితారావు, బండారుపల్లి రాంచందర్‌రావు పాల్గొన్నారు. యాంత్రికంగా రోజులు గడపకుండా యాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలను సందర్శించడం మనోవికాసాన్ని ఇస్తాయని డాక్టర్ నోరి రాజేశ్వరరావు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం వల్ల ఈ యాత్రాదర్శినిని రాయడం జరిగిందని, యాత్రలు చేయడం అభిరుచిగా మారిందని రచయిత నవనీతరావు పేర్కొన్నారు. చార్‌ధామ్‌యాత్ర చేసి స్వీయ అనుభవాలను పుస్తకంగా భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా రాయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...