మతపరమైన ఆగాధాలు వద్దు


Mon,November 4, 2019 02:34 AM

ఖైరతాబాద్: మతం మానవత్వాన్ని చాటాలి.. మతపరమైన ఆగాధాలు వద్దని.. ఒకరి ధర్మాన్ని మరొకరు గౌరవించుకోవాలి.. అప్పుడే శాంతి, సోదరాభావం పరిఢవిల్లుతుందని పలు మతాలకు చెందిన పెద్దలు ఉద్ఘాటించారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మతాలకు చెందిన ధార్మిక గురువులంతా కలిసి ధార్మిక జన మోర్చాను స్థాపించారు. జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు సలీమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చి ఎగ్జిక్యూటివ్ రెవరెండ్ ఆంటోని రాజ్, జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర కార్యదర్శి సాదిక్ అహ్మద్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి స్వామి పూర్ణతేజ్, సర్దార్ నానక్‌సింగ్, ధర్బంగ్ జైన్ సంస్థ అధ్యక్షుడు వినోద్ జైన్, సర్దార్ ఇందన్ సింగ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ మంచి కోసం, దానిని సమాజంలో పెంపొందించేందుకు ధార్మిక జనమోర్చా ఆవశ్యకత ఉందన్నారు. ఇది తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా విస్తరించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి పూర్ణతేజ్ మాట్లాడుతూ ఎవరికి వారు తమ మతమే గొప్పదన్న భావనను తమ మదిలో నుంచి తొలిగించుకోవాలన్నారు. మానువులందరూ వసుదైక కుటుంబం వల్లే కలిసి ఉండాలన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...