ఆప్యాయతకు కేరాఫ్ ఆ సర్వీసులు


Mon,November 4, 2019 01:47 AM

-70 ఏళ్ల దశకంలోనే పల్లె పల్లెకూ ప్రయాణం
-నారాయణపేట కేంద్రంగా వివిధ ప్రాంతాలకు బస్సులు
- డ్రైవర్లు, కండక్టర్లు, ప్రజల మధ్య వీడని అనుబంధం
-అంకితభావంతో సేవలందించిన యజమానులు

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ర వాణా సౌకర్యాలు, రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్న రోజుల లో సర్వీసులు ప్రజలను వారివారి గమ్యస్థానాలకు చేరవేశా యి. క్రమం తప్పకుండా ఆయా రూట్లల్లో తీసుకువెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వీడని అనుబంధాలుగా ఏర్పడి కుటుంబ సభ్యులుగా మారిపోయి ఒకరి కష్ట సుఖాలలో మరొకరు భాగం పంచుకునేలా వారివారి మధ్య వీడని అనుబంధాలు ఏర్పడేలా ఆత్మీయతలను అలనాటి సర్వీసుల నిర్వాహకులు, పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు ఇప్పటికీ తమ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. అలనాటి ఆ తియ్యని సర్వీసుల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రయాణికుల హృదయాలలో చెదరని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.

నారాయణపేట కేంద్రంగా సర్వీసులు అలా నాడు ప్రైవేటు సర్వీసులు ప్రయాణికులకు, సేవలు అందించాయి. వాహన సదుపాయాలు రోడ్డు వ్యవస్థ అంతంత మాత్రంగానే రోజులలో కొంత మంది ప్రయాణికులకు సేవలు అందించేందుకు సర్వీసులను తీసుకువచ్చి వివిధ రూట్లల్లో తిప్పారు. దీంతో నాడే ప్రయాణికులకు సేవలను ఆరంభించారు. పేట జిల్లా కేంద్రానికి చెందిన ఏవీ నారాయణరావు 1965లోనే ఒక స ర్వీసును తిప్పారు. నారాయణపేట నుంచి పేరపల్లా, ఒత్తుగుం డ్ల, ఎదిరపాడు, మద్దూరు, పల్లెర్ల, మీర్జాపూర్, బిజ్జారం మీ దుగా కోస్గి వరకు సర్వీస్ నడిచేది. ఈ సర్వీసు విజయవంతంగా నడుస్తుండడంతో నారాయణరావు మరిన్ని సర్వీసులను ప్రారంభించారు. పేట నుంచి యానగుందె, గుర్మిట్కల్, యాద్గీర్, పెద్ద జట్రం, నర్వ, సేడం, దేవరకద్ర మధ్య మొత్తం 10 సర్వీసులను నడిపారు. ఈ బస్సులలో 40 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లుగాను, మరి కొందరు మెకానిక్‌లుగా పనిచేసేవారు. బస్సులు వెళ్లేదారులు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేసేందకు, మరికొందరు సిబ్బంది పని చేసేవారు. ఏఎన్‌రావు సర్వీసుల పేరుతో ఈ సర్వీసులు నడిచాయి. ఎఎం అబ్దుల్ రహిమా న్, మక్తల్ నుంచి కృష్ణ, అనుగొండ మధ్య మక్తల్‌కు అబ్దుల్ రహమాన్ సర్వీసు నడిచేది. కాగా మక్తల్ నుంచి కర్ని, కల్వాల్ మీదుగా ఆత్మకూర్‌కు మరో సర్వీసు కూడా తిరిగేది.

చార్జీలు ఇలా..
ఆ రోజులలో సర్వీసు చార్జీలు సైతం చాలా తక్కువగా ఉం డేవి. నారాయణపేట నుంచి యానగుందె వరకు రూ.1.50 పై సలు, కోస్గికి రూ.3.80 పైసలు, మక్తల్ నుంచి అనుగొండకు రూ.2.80 పైసల చొప్పున వసూలు చేసేవాళ్లు. అణా, దోఅణా, చౌమాణ, 25 పైసలు, 50 పైసల చొప్పున ఆయా గ్రామాల మధ్య చార్జీలను వసులు చేసేవారు. మొదట్లో టికెట్లు లేకుండా నేరుగా చార్జీలను వసూలు చేసి లాభాలు గడించేవారు. సిబ్బం ది దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు వీలుగా టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టి ప్రయాణికులకు సేవలందించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...