మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య


Mon,November 4, 2019 01:46 AM

దేవరకద్ర రూరల్: పరీక్ష సరిగ్గా రాయలేదని మనస్థాపం చెంది ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తె లిపిన వివరాల మేరకు.. అడ్డాకుల మండలం కన్మనూర్‌కు చెందిన బండా రు నర్సింహులు కుమారుడు బాలకృష్ణ మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. కాగా, గతకొద్దిరోజుల క్రితం ఎస్‌ఏ1 పరీక్షను రాశాడు. తరువాత హాస్టల్‌లో ఉంటూ పరీక్ష సరిగ్గా రాయలేదని తోటి విద్యార్థులతో చర్చించుకునగా, తోటి విద్యార్థులు తరువాత మళ్లీ రా యవచ్చులే అని ధైర్యం చెప్పారు. అయినా అతను మదనపడుతూ మనస్థాపంతో శుక్రవారం రాత్రిపురుగుల మందు తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు గ్రామంలోని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి హై దరాబాద్ గాంధీ దవాఖానకు రెఫర్‌చేసారని, అక్కడ చికిత్స పొందుతూ శ నివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థి తండ్రి నర్సింహులు ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...