ఇంగ్లిష్ ఎస్జీటీ పోస్టులకు పచ్చజెండా


Mon,November 4, 2019 01:44 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పచ్చజెండా ఊపింది. జూలైలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, అక్టోబర్ 28న ఎస్‌జీటీ తె/మీ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 168 ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖాళీలను విద్యాశాఖాధికారులు గుర్తించారు. తె/మీ అభ్యర్థుల భర్తీ ప్రక్రియ సమయంలోనే ఇం/మీ కు సంబంధించిన ఖాళీలను గుర్తించారు. నియామక షెడ్యూల్ విడుదలైన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సి ద్ధం చేసుకున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా విద్యాశాఖ కార్యాలయానికి రావాల్సి ఉంది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ తెలుగు, ఉర్దూ మీడియం పోస్టులు భర్తీ కావడంతో ఉపాధ్యాయు ల కొరత తీరింది. ఇంగ్లిష్ మాధ్యమ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల తరగతులు మరింత పకడ్బందీ గా నిర్వహించేందుకు అవకాశం ఉంది.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...