మకుటంలేని మహారాజు.. రాజాసోంభూపాల్


Thu,September 12, 2019 03:43 AM

చిన్నచింతకుంట: అమరచింత నియోజకవర్గంలో చివరి రాజుగా కొనసాగి, కురుమూర్తి దేవస్థానం సంస్థానధీశులుగా 1962 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించి నియోజకవర్గంలో మకుటంలేని మహారాజుగా పనిచేసిన మహానీయుడు రాజాసోంభూపాల్ అని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అమ్మపూర్‌లోని రాజాసోంభూపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఆమె హాజరై మాట్లాడారు. ఆనాటి రాజులలో చివరివాడిగా ఉండి తన నియోజకవర్గంలో తన సొంత పొలాలను పేదలకు దానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన నేటికీ ప్రజల హృదయాలలో ఉన్నారన్నారు. అంతకుముందు సోంభూపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాధిక్, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, అడ్డాకుల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ జగదీశ్వర్, సర్పంచు సులోచన పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...