జడ్చర్ల స్టాక్ పాయింట్‌ను పరిశీలించిన జేడీఏ


Thu,September 12, 2019 03:41 AM

జడ్చర్ల: మమబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కడా లేదని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్(జేడీఏ) సుచరిత తెలిపారు. బుధవారం జడ్చర్ల స్టాక్ పాయింట్‌కు స్పిక్ కంపెనీకి చెందిన 1,629టన్నుల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న జేడీఏ జడ్చర్ల రైల్వేస్టేషన్ దగ్గర స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఇతర జిల్లాలకు సరఫరా అవుతున్న యూరియా వివరాలను మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1,629టన్నులలో 500 టన్నుల యూరియాను మహబూబ్‌నగర్ జిల్లా, 500 మెట్రిక్ టన్నులు వనపర్తి, 500 టన్నులు నారాయణపేట, 629 టన్నులు జోగుళాంబ గద్వాల జిల్లాకు కేయించారు. మహబూబ్‌నగర్ జిల్లా యూరియా నుంచి జడ్చర్లకు 108టన్నుల యూరియాను కేటాయించడం జరిగింది. గురవారం కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా 3వేల టన్నులు రానుందని అది 1600, 1400రెండు వ్యాగన్లు రానున్నట్లు తెలిపారు. జడ్చర్ల ఏవో రాంపాల్, మార్క్‌ఫెడ్ అధికారి ప్రణిత్, స్పిక్ కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ శివకుమార్ ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...