పల్లెప్రగతి ప్రణాళికలను పంపాలి


Thu,September 12, 2019 03:41 AM

భూత్పూర్: పల్లె ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను ఎప్పటికప్పుడు పంపాలని జెడ్పీ సీఈవో యాదయ్య సూచించారు. బుధవారం ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు, ఇందుకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. అంతేకాకుండా గ్రామాల్లో నిర్మించుకున్న మరుగుదొడ్లను అందరూ వాడడం లేదని, ఇంకుడుగుంతల నిర్మాణాలను ఇంకా ప్రోత్సహించాలని తెలిపారు. శ్రమదానం చేయడం వల్ల గ్రామాల్లో మురుగు నీరు నిల్వకుండా గుంతలను పూడ్చాలన్నారు. ఎంపీడీవో శ్రీహరి, ఎంపీవో జగదీశ్వర్, జూనియర్ అసిస్టెంట్ అతిఖుర్ రహమాన్, ఏపీవో విమల తదితరులు పాల్గొన్నారు.

మౌలికల వసతులపై ప్రధానదృష్టి
మూసాపేట: గ్రామాల్లో మౌలిక వసుతులపై ప్రధానదృష్టి పెట్టాలని జెడ్పీ సీఈవో యాదయ్య సూచించారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని వేములలో జరుగుతున్న కార్యక్రమాలను ఆకస్మీకంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం పనులు, వీధి దీపాలు, విద్యుత్ తదితర సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలకు నిధుల సమకూర్చేందుకు పన్ను చెల్లింపులు, దాతల చేయూతపై ఆలోచించాలని చెప్పారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...