గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి


Thu,September 12, 2019 03:40 AM

రాజాపూర్ : పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం బాలానగర్ మండలం పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామా ల్లో ఆయన పర్యటించారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు స్వలాభం ఆశించకుండా గ్రామ అభివృద్ధికి అందరూ కట్టుబడి ఉండాలని, ఇందులో భాగంగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటుకోవాలని సూచించారు. గ్రామంలో ప్లాటిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. అలాగే, ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు. గ్రామంలో పెంట కుప్పలు లేకుండా చేస్తే ఎలాంటి వ్యాధులు రావాన్నారు. గ్రామం లో ఇంటింటికీ చెత్త సేకరణ, మురుగు కాల్వలను శుభ్ర పర్చేందుకు పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని సర్పంచులకు సూచించారు. అదేవిధంగా గ్రామంలోని పాడుపడ్డ ఇండ్లు, బావులను గుర్తించి, వాటి యజమానులతో మాట్లాడి తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...