మతసామరస్యానికి ప్రతీక మొహర్రం


Wed,September 11, 2019 01:10 AM

-ముగిసిన వేడకలు
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ వేడుకలు మంగళవారం 10వరోజు పీర్లా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూ రు, భూత్పూర్‌ మండలం కప్పెట, మొల్గర, మద్గిగట్ల, హన్వాడ, ఊట్కూర్‌ తదితర ప్రాంతల్లో మొహర్రం వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో చాల ప్రాంతల్లో ముస్లిం సోదరులు షర్బత్‌(బెల్ల, లేదా పాలతో చేసిన పానకం) పంపిణీ చేశారు.

కుల మతాలకు అతీతంగా..
మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో హిందూ - ముస్లిందరూ సోదర భావంతో కుల మతాలకు అతీతంగా మొహర్రం వేడుకలను నిర్వహించారు. మండలంలోని రాంచంద్రాపూర్‌, బొక్కలోనిపల్లి, కోటకదిర, మాచన్‌పల్లి, ఫత్తేపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాలలో పీర్ల సవార్ల దగ్గరికి వెళ్లి దట్టీలు కప్పి, ఊదు బెల్లం చదివించుకొని మొక్కలు తీర్చుకున్నారు. పీర్ల పండుగ రోజు, పీర్ల కింద నుంచి వెళ్తే, కోరికలు నెరవేరుతాయని ప్రజలు బారులుగా పీర్లకు ఎదురుగా పడుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...