నల్లమలలో అరుదైన స్లెండర్‌ క్లోరల్‌ స్నేక్‌


Wed,September 11, 2019 01:08 AM

అమ్రాబాద్‌ రూరల్‌ : నల్లమల అడవులు పర్యవర ణానికి, పెద్దపులులకు, శాఖహార జంతువులతో పాటు జీవ వైవిద్యానికి పెట్టింది పేరు.. అదేతీరులో దేశంతో పాటు ఇతర దేశాల్లో లేనటువంటి అరుదైన వృక్ష, జంతు, పక్షులు మరియు పాములు అందులో విషసర్పాలు ఎక్కడా లేని వివిధంగా ఈ అడవుల్లో దర్శనమిస్తాయి. అటవీశాఖ అధికారులు కూడా ఎప్పుడూ చూడని, వినని పాములు చాలా అరుదుగా కన్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇక్కడి ప్రజలు ఎన్నడూ చూడని పామును మంగళవారం స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మన్ననూర్‌ గ్రామం అంబేద్కర్‌ కాలనీకి సమీపంలో ఉన్న అమ్రాబాద్‌ సీ-బీట్‌ అడవుల్లో ఒక అరుదైన పామును కాలనీకి చెందిన ముద్దునూరి లక్ష్మినారాయణ గుర్తించారు. తాను ముందుగా పామును చూసినప్పుడు ‘షూ’ కు లేష్‌లా కన్పించిన వస్తువును కాలుతో కదిలించారు. అయితే తిన్నగా అది కదలడంతో వెంటనే తాను ఇది చాలా వింతగా ఉన్నదిని, ఈ పాము ఈ అడవుల్లోగానీ, అడవుల సమీపంలో ఉన్న ప్రజానీకం ఎన్నడూ చూడలేదనుకున్నారు. కొత్తగా ఉండటంతో దానిని ఒక ప్లాస్టిక్‌ బాటిల్లోకి తిన్నగా పంపించారు. తదుపరి గ్రామంలోని అటవీశాఖ అధికారులైన (ఎఫ్‌బీవో) నవీన్‌, కార్తీక్‌కు అప్పజెప్పారు. వారు కూడా దానిని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత తమ పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో పాటు వారికి తెలిసిన ప్రత్యేక నిపుణులకు పామును వాట్సఫ్‌ ద్వారా పంపించి ఈ పాము ఏ రకానికి చెందినదో గుర్తించాలని సూచించారు.

దానిని పరిశీలించిన వారు ఇది చాలా అరుదైన పామని భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రాంతాల్లోనే ఉంటుందని, మరెక్కడ కన్పించని పామని తెలిపారన్నారు. దీనిని స్లెండర్‌ క్లోరల్‌ స్నేక్‌ మరియు ఇండియన్‌ క్లోరల్‌ స్నేక్‌ అని రెండు పేర్లతో పిలుస్తారని తెలిపారు. ఇది చాలా విషపూరిత పాముల్లో ఒకటని, ఇది కాటేస్తే ముందుగా మనిషి నరాల్లోకి విషం ప్రవేశించి నేరుగా మనిషి మెదడులోకి అతివేగంగా పయనించి కొన్ని క్షణాల్లో చంపేస్తుందన్నారు. ఇది పిల్ల పాము సుమారు అర మీటరు పొడవు ఉన్నదన్నారు. చాలా షార్పుగా ఉంటుందని, తాసు పాము మాదిరిగా తన కోరలను బయటకు తీస్తున్నదన్నారు. ఈ పాముకు తల భాగంలో నలుపుచారలు మరియు తోకభాగంలో నలుపు చారులు ఉన్నాయన్నారు. ఆ పామును పట్టుకున్న వ్యక్తి దాని ప్రాధాన్యత తెలువక పోవడంతో ప్లాస్టిక్‌ బాటిల్లోకి పంపే క్రమంలో తన చేతులమీదికి వచ్చింద న్నారు. అయితే అది అప్పటికే భూమిలో ఉన్న ఎరను తిని ఉండటం వలన ఎలాంటి ప్రమాదం కలిగించలేక పోయిందని భావిస్తున్నట్లు వారు తెలిపారు. సీసీలో ఉంచి దానిని గమనిస్తున్నప్పుడు తిన్న (ఎరను) వానపామును తిరిగి నోటి ద్వారా బయటికి తీసిందన్నారు. తదుపరి దాని వేగం మరింతగా పెంచుటకు ప్రయత్నం చేస్తుండగా బాటిల్లో ఎక్కడికి పోలేని స్థితిలో ఉండిపోయిందన్నారు. వానపామును బయటికి తీసిన తరువాత పాము కింది భాగంలో లేత పసుపురంగులోకి మార్పు చెందిందన్నారు. పామును పరిశీలించిన ప్రత్యేక నిపుణులు చాలా అరుదైన పాములు అలాగే విషపూరి తమైనదని చెప్పిన తరువాత కొంత భయాందోళనకు గురయ్యామన్నారు. తదుపరి నిపుణులతో నిర్ధారణ చేసుకున్న అటవీశాఖ అధికారులు తిరిగి ఆ పాము ( స్లెండర్‌ (ఇండియన్‌) క్లోరల్‌ స్నేక్‌ పాము)ను నల్లమల లోతట్టు అడవుల్లో వదిలేశారు. దాని తల్లి పాము కూడా కాలనీ అడవుల్లోనే ఉండి ఉంటుందన్నారు. కావున కాలనీ వాసులు బహిర్భూమికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...