భీమమ్మ దర్శనానికి భక్తుల బారులు


Tue,September 10, 2019 12:59 AM

కోయిలకొండ : మండల కేంద్రంలో భీమమ్మ(బీబీ ఫాతిమా) దర్శనం కోసం సో మవారం భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారు జామున అమ్మకు సర్కార్ చక్కర సమర్పించిన అనంతరం 3 గంటల నుంచి బీబీ ఫాతీమా ఫీరును గ్రామంలో ఊరేగింపునకు తరలిస్తారు. తెల్లవారు జామున 5 గంటలకు పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించనున్నారు. అగ్నిగుండం, బీబీ ఫాతిమా పీరు ఊరేగింపును తిలకించేందుకు సోమవారం సాయంత్రం నుంచే కోయిలకొండ కు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా సోమవారం తెల్లవారు జామున హుస్సేన్‌పాషా, చాన్‌దూల పీర్ల సవారీలతో కనివిందు చేశారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...