గ్రామాభివృద్ధికి కలిసిరావాలి


Mon,September 9, 2019 12:44 AM

-ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం అవసరం
-30 రోజుల ప్రణాళికలను విజయవంతం చేయాలి
-పాలమూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి
-పల్లెప్రగతిలో భాగంగా ముచ్చింతలలో పర్యటన
చిన్నచింతకుంట : తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రతి పల్లె ప్రగతి సాధించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదివారం చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌ పర్యటించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అందరూ సమిష్టిగా పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. గ్రామాలలో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, హరితహారం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూ చించారు. వ్యాధుల నివారణ కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 30 రోజుల కా ర్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, సర్పంచ్‌ హరితరెడ్డి, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, ఉప సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ దేవేంద్రమ్మ, మాజీ ఎంపీటీసీ హర్షవర్దన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేశ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మన్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...