అంతర్జాతీయ క్రీడల్లో గురుకుల విద్యార్థులు


Mon,September 9, 2019 12:40 AM

జడ్చర్లటౌన్‌: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పా టు చేసిన క్రీడా అకాడమీలలో శిక్షణపొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీ స్థాయిక్రీడల్లో రాణిస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడా అధికారి రామలక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగిన జోనల్‌స్థాయి హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గురుకుల విద్యార్థులు చూపిస్తున్న ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గురుకులాలకు ఓ గుర్తింపు వచ్చిందన్నారు. దీనికి రాష్ట్ర ప్ర భుత్వం పూర్తిస్థాయిలో అందిస్తోన్న ప్రోత్సాహమేనని చెప్పా రు. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ప్రోత్సాహంతో ఉపాధ్యాయుల కృషి ఫలితంగా విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడ ల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 23 క్రీడా అకాడమీలు నిర్వహిస్తున్నారన్నారు. క్రీడా అకాడమీల ద్వారా శిక్షణ పొంది విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు వెళ్లి దేశానికి, రాష్ర్టానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు. అంతకుముందు జోనల్‌స్థాయి హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ పోటీలను ప్రారంభించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...