ఉత్సాహంగా నెట్‌బాట్‌ జట్ల ఎంపిక


Mon,September 9, 2019 12:40 AM

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: ఖమ్మం, కరీంనగర్‌లో జరగనున్న సబ్‌ జూనియర్‌, సీనియర్‌, నెట్‌బాల్‌ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలను ఆదివారం జిల్లా పరిషత్‌ మైదానంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను రాష్ట్ర ట్రైబల్‌వెల్ఫేర్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులకు కొదువలేదని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. క్రీడాకారులకు తనవంతు సహకారం ఉంటుందని రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ కనబర్చి జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజాఖాన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే సీనియర్‌, సబ్‌ జూనియర్‌ జట్లకు ప్రాబబుల్స్‌ ఎంపిక చేసినట్లు తెలిపారు. శిక్షణ నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంమోహన్‌గౌడ్‌, ట్రెజరర్‌ సోహెల్‌ఖాన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సాధత్‌ఖాన్‌, కోచ్‌ అంజద్‌ అలీ, పీఈటీ అశోక్‌బాబు, బాల్‌రాజ్‌, స్వప్న, జ్యోతి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...