అలరించిన చంద్రశేఖర్‌రావు కీర్తనలు


Mon,September 9, 2019 12:40 AM

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రముఖ గాయకులు గద్వాల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక, అన్నమాచార్య కీర్తనలు భక్తులను అమితంగా అలరింపజేశాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం గద్వాల చంద్రశేఖర్‌రావు కీర్తనలను అలకించారు. దాదాపుగా 3గంటల పాటు చంద్రశేఖర్‌రావు తన గానమాధుర్యంతో భక్తులను అలరింపజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మశ్రీ నవీన్‌జోషి, శ్రావణ్‌కుమార్‌, చంద్రకాంత్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...