పాము కాటుతో చిన్నారి మృతి


Sun,September 8, 2019 03:02 AM

అమ్రాబాద్ రూరల్ : అర్ధరాత్రి పాము కాటు వేయడంతో ఆరేండ్ల చిన్నరి లాస్య మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని వెంకటేశ్వర్లబావి గ్రామంలో చోటు చేసుకున్నది. కుటుంబస్తులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రోజు మాదిరిగానే రాత్రి భోజనం చేసిన లాస్య పడుకున్నది. అర్ధరాత్రి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలపడంతో కప్పుకున్న బిస్తరు తీసి చూశారు. పాప పడుకున్న చోటనే పాము ఉండటాన్ని గుర్తించారు. పాపను తిన్నగా అక్కడ నుంచి కదిలించి పామును చంపే ప్రయత్నం చేయగా బీరువా కిందికి వెళ్లిందన్నారు. వెంటనే లాస్యను అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లామ న్నారు.

అక్కడ ప్రథమ చికిత్స చేయించుకొని, పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసు కెళ్లాలని వైద్యులు సూచనలు చేశారన్నారు. అర్ధరాత్రి పాపను హైదరబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించిం దని తెలిపారు. ఆ పాప మండల కేంద్రంలోని శ్రీ విద్యా బ్రిలియంట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నదని తెలిపారు. పాప మరణించడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శనివారం విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున గ్రామస్తులు కొంత ఆర్థిక సాయం చేయగా విద్యార్థిని చదువుతున్న పాఠశాల యాజమాన్యం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...