వినాయక..సెలవిక


Sun,September 8, 2019 03:02 AM

జడ్చర్ల : వినాయక చవితిని పురస్కరించుకొని జడ్చర్ల, బాదేపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కొలువుదీరిన గణనాథుల నిమజ్జన ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలకరించిన వాహనాలపై గణనాథుడి విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఊరేగింపులో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుం డా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను జి ల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ సునీత, సీఐ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...