సమిష్టిగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి


Sun,September 8, 2019 03:02 AM

కోయిలకొండ : గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు స్థా యీ సంఘాలు, కోఆప్షన్ సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈ వో యాదయ్య సూచించారు.శనివారం మండలంలోని రాంపూ, పార్‌పల్లి గ్రామాల్లో స్థాయీ సంఘాల సభ్యుల ఎన్నికలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, వందశాతం హరితహారం, పన్నుల వసూలు, విద్యుత్ సమస్యల పరిష్కారం, ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నియంత్రిక పద్ధతి లో నిధుల వినియోగం తదితర వాటిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూ చించారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్థాయీ సంఘాల ఏర్పాటు, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని, ఆదివారం నుంచి గ్రామ పంచాయతీల్లో కార్యాచర ణ ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాములు , ఎంపీడీవో విజయప్ప, ప్రత్యేకాధికారి కర్నయ్య, ఎంపీవో రషీద్ అహ్మద్, కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ శివారెడ్డి, వెంకటేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...